క్రేజీ వాల్‌పైనే ఎందుకలా?
ఢిల్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందుకున్ని భారతీయ జనతాపార్టీకి ముచ్చెమటలు పట్టించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై మరోసారి బూటు దాడి జరిగింది. సరి-బేసీ విధానంలో శనివారం కేజ్రీవాల్ రెండో విడత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి చెప్పు బూటు విసిరి నిరసన తెలిపారు. అంతేకాదు తన దగ్గర ఉన్న సీడీలను సైతం సీఎం ముఖంపై విసిరాడాఉ. ఉన్నట్టుండి ఈ సంఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇది ప్రతిపక్ష పార్టీ వాళ్లో.. లేక దుండగులో చేసిన పని కాదు. ఆమ్ ఆద్మీ సేకు చెందిన ఒక వ్యక్తే ఇలాంటి దుస్సా
హాసనానికి పాల్పడడం అందరినీ ఆశ్చయానికి గురి చేస్తోంది.
ఎవరి తప్పు?
కాగా కేజ్రీవాల్ పై గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. 2014లో ఢిల్లీలోని సుల్తాన్ పురి ప్రాంతంలో రోడ్డు షో సందర్భంగా ఓ వ్యక్తి కేజ్రీవాల్ చెంపపై కొట్టాడు. అదే ఏడాది హరియాణాలో మరో వ్యక్తి కేజ్రీవాల్ పై దాడికి ప్రయత్నించాడు. ఈ ఏడాది జనవరిలో ఓ మహిళ కేజ్రీవాల్ పై ఇంకు చెల్లేందుకు ప్రయత్నించింది. తాజాగా ఆమ్ ఆద్మీ సేనకు చెందిన ఓ వ్యక్తి బూటు విసిరాడు. ఎందుకు ప్రజలు అలా తిరగబడుతున్నారు? ప్రజల సమక్షంలో సీఎంను ఎందుకు అవమానిస్తున్నారు? వాళ్లకు జరిగిన నష్టమేంటి? ఇది ప్రజల తప్పా? పాలకుడి తప్పా అనేది ఇప్పటికైతే ధర్మ సందేహమే. అయితే ఈ సంఘటనను కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఖండించడం గమనార్హం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.