ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలు
కృష్ణా పుష్కరాలను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత సంఘటలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పుష్కరాలకు ఇక రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు అధికారులను అప్రమత్తం చేస్తున్నాయి. అంతేకాదు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు ఇప్పటికే అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లు పెట్టి పలు సూచనలు చేశారు. పుష్కరస్నానం అన్నది కేవలం నదీస్నానం చేయటంతో సరిపెట్టటం కాదన్నారు. పుష్కరాలు అందరిలో స్పూర్తిని కలిగించాలని, రాష్ట్రాభివృద్ధిపై అవగాహన, అంకితభావం పెంపుచేయాలన్నారు. కాగా మొదట్లో పుష్కర పనులు మందకొడిగా జరిగినా ఇపుడు ఊపందుకున్నట్లు ఇద్దరు సీఎంలు ఒప్పుకోవడం గమనార్హం. అయితే పుష్కర యాత్రీకులకు సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది వాలంటీర్లు మందుకువస్తున్నారని, వారి సేవలను ఉన్నతాధికారులు సమర్ధవంతంగా వినియోగిచుకోవాలని సూచించారు. పుష్కర విధుల్లో చేరని అధికారులు ఎవరైనా ఉంటే వెంటనే వారందరూ విధుల్లో చేరాల్సిందిగా ముఖ్యమంత్రులు ఆదేశించారు.
విజయవాడలోని దుర్గఘాట్‌లో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి శుక్రవారం తెల్లవారుజామున పుష్కరస్నానాలు ప్రారంభించనున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే ఘాట్‌లో ఉదయం 5.45 గంటలకు పుష్కరస్నానం ఆచరించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ మండలం గొందిమల్ల పుష్కరఘాట్‌లో పవిత్రస్నానమాచరిస్తారని సమాచారం. ఆగస్టు 12, శ్రావణ శుద్ద నవమి శుక్రవారం ఉదయం 5.58 గంటలకు కేసీఆర్ సతీసమేతంగా పుష్కర స్నానం చేస్తారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.