Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Botsa Satyanarayana lashes out at TDP leaders for illegally purchasing lands

By   /  March 8, 2016  /  Comments Off on Botsa Satyanarayana lashes out at TDP leaders for illegally purchasing lands

    Print       Email

botsa 1

రాజధానికి వైసీపీ వ్యతిరేకం కాదు: బొత్స సత్యనారాయణ

InCorpTaxAct
Suvidha

 

ఏపీ రాజధానిలో భూ దందా జరుగుతోందని మరోసారి వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఏపీలో పరిస్థితి.. చినబాబు కలెక్షన్‌..పెదబాబు శాంక్షన్‌ అన్నట్లుగా ఉందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యానారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ స్వయంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.రాష్ట్ర అభివృద్ధి పేరును అడ్డుపెట్టుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు.విశాఖలోని వైసీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో సీఎం చంద్రబాబు ముందే ఒక నిర్ణయానికి వచ్చారని అన్నారు.ఆ తర్వాతే ఆయన మంత్రులు ఆ ప్రాంతంలోని రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. దీనిని పక్కా ఆధారాలతో బయటపెడితే..అబద్దం అంటున్నారని విమర్శించారు. రాజధానిని అడ్డుకునేందుకే వైసీపీ రాద్ధాంతం చేస్తోందని తమపై ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు.

ఏపీ రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదన్నారు. రాజధాని పేరిట జరిగిన దోపిడీపై మాత్రమే వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తమ ఆరోపణలు నిజంకాకపోతే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన రవికుమార్‌ పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. ఎక్కడో అమెరికాలో ఉంటున్న రవికుమార్‌కు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ వంటి ప్రాంతాల్లో కాకుండా అక్కడ వ్యవసాయ భూములు కొనాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి నారాయణ సంస్థలో పనిచేస్తున్న ప్రమీల అనే మహిళ పేరిట.. మంత్రి బంధువైన సాంబశివరావు పేరిట భూములు కొనడం నిజం కాదా.. ? అంటూ ప్రశ్నించారు. మరో మంత్రి రావెల కిశోర్‌బాబు భార్య శాంతి జ్యోతి పేరిట అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయడం నిజంకాదా..? అంటూ ప్రశ్నించారు. ధూళిపాళ్ల నరేంద్ర పోరంబోకు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుంటే మందలించాల్సిన చంద్రబాబు.. కొంటే తప్పేంటని ఎదురు ప్రశ్నించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.అసైన్డ్‌, పోరంబోకు భూములు కొనుగోలు చేయడం కరెక్టేనా.. ? అని ప్రశ్నించారు.

లింగమనేని గెస్ట్‌హౌస్‌ నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని.. అలాంటి భవనాన్ని కూల్చకుండా ఏకంగా సీఎం చంద్రబాబు నివాసం ఉంటే.. ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయని ప్రశ్నించారు. రాజధాని పేరిట దోపిడీ జరుగుతోందని తెలియడం వల్లే రాజధాని శంకుస్థాపనకు రాలేనని తమ పార్టీ అధినేత జగన్‌ చెప్పారని అన్నారు. పట్టిసీమ, ఇసుక దందా, రాజధాని పేరిట భూముల సేకరణ వంటి విషయాల్లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వీటన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరడం ద్వారా చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. కాపు ఉద్యమం తమ పార్టీ కనుసన్నల్లో జరుగుతుందనడంలో ఏ మాత్రం నిజం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →