Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Botsa Satyanarayana response about Chandrababu and Pawan Kalyan

By   /  February 20, 2018  /  Comments Off on Botsa Satyanarayana response about Chandrababu and Pawan Kalyan

    Print       Email

చిత్తశుద్ది ఉంటే.. పవన్ మాతో కలిసి నడవాలి : బొత్స

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా పై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మద్య కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ప్రతిపక్షలు, విపక్షాలే కాదు ప్రజలు సైతం అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చంద్రబాబు ఆజ్ఞాతవాసిలా వ్యవహరించారని విమర్శించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ముందునుంచి వైసీపీ పోరాడుతోందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ పోరాటాన్ని ఉధృతం చేశారని చెప్పారు.

ఏప్రిల్‌ 5లోగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్‌ ప్రకటించారన్నారు. చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి తేకుండా అజ్ఞాతంలో ఉంటూ తమ అనుకూల మీడియాలో లీకులిస్తున్నారని, తాజాగా బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. రాజీనామాలు కాదు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్‌ కళ్యాణ్‌ ఉచిత సలహా ఇచ్చారని, ఆయన సలహాను సైతం తీసుకుని అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పామన్నారు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే తాము పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీకి చెప్పాలన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →