Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Brahmaji Praise NTR..!

By   /  August 13, 2016  /  Comments Off on Brahmaji Praise NTR..!

    Print       Email

janathagarrageఎన్టీఆర్ పై బ్రహ్మాజీ ఆశక్తికర వ్యాఖ్యలు..!

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ తారక్ పక్కన ఉంటే చాలు.. గూగుల్ అవసరం లేదు’ అని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఆడియో విడుదల వేడుక శుక్రవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

InCorpTaxAct
Suvidha

‘సీనియర్ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం రాలేదు.. అయితే.. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. వయసులో నాకంటే చిన్నవాడైనా సరే తారక్‌ను ‘అన్నా’ అని సంబోధిస్తా.. చాలామందితో నటించాను కాని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఓ గూగుల్ లాంటి వాడు. సెట్స్‌లో మేము కార్ల గురించి మాట్లాడుకున్నా, బాడీ డైట్ గురించి మాట్లాడుకున్నా, యానిమల్స్ గురించి మాట్లాడుకున్నా, మూజిక్‌ గురించి మట్లాడుకున్నా… 1970లోని ఫలానా సాంగ్ గురించి డిస్కస్ చేసుకున్నా..మేము గూగుల్ ఓపెన్ చేసి చూడాలి. అదే తారక్ మా పక్కనుంటే ఆ అవసరమే రాదు. ఓ టాపిక్ తీసుకుంటే.. దాని హిస్టరీ, పుట్టుపుర్వోత్తరాలు పాట పాడి మరీ వినిపిస్తాడు. సెట్స్‌లో ఫైట్ రిహార్సల్స్ జరుగుతుంటే చూస్తుంటాడు తప్ప తను మాత్రం రిహార్సల్స్ చేయడు. టేక్ చెప్పగానే డైరెక్ట్‌గా షాట్ లోకి వెళ్ళి లీనమైపోతాడు. సరే, ఫైట్స్ లో ప్రావీణ్యం ఉందేమో అనుకుంటే.. సాంగ్స్ కూడా ఎలాంటి రిహార్సల్స్ లేకుండా చేసేస్తాడు. సరే చిన్నతనం నుంచి మంచి డ్యాన్సర్ కదా అనుకుంటే.. డైలాగ్ లు కూడా గడగడ చెప్పేస్తాడు. ఐదు పేజీల డైలాగ్ ని ఏ మాత్రం బట్టీపట్టకుండా సింపుల్ గా ఓ సారి చదివేసి చెప్పేస్తాడు. దీంతో తారక్ ను చూస్తే తమలాంటి వారికి ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని రకాల కళలు ఈ మనిషికి ఎలా వచ్చాయి అనిపిస్తుంది’ అంటూ ఎన్టీఆర్ ప్రావీణ్యం గురించి చెప్పుకొచ్చాడు. తన స్పీచ్ చివరిలో సీనియర్ ఎన్టీఆర్ బొమ్మవైపు చూపిస్తూ.. ఆ పెద్దాయన ఆశీస్సులు తారక్‌కు ఉన్నట్లున్నాయి అని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →