అందం..మహేష్ సొంతం!
సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి వేరే చెప్పనక్కర్లేదు. అతని నటన ఎంత నేచురల్‌గా ఉంటుందో అతను కూడా మేకప్ లేకుండా అంత నేచురల్‌గా ఉంటాడు. ప్రస్తుతం నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ ను మరింత అందగాడిగా చూపిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు కానీ.. టీజర్లు గానీ గమనిస్తే మహేష్ బాబు వేసుకున్న కాస్టూమ్స్ ప్రత్యక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిన్న జరిగిన బ్రహ్మోత్సవం ఆడియో పంక్షన్‌లోనూ మహేష్ అంతే అందంగా కనిపించాడు. ఆడియో పంక్షన్ సందర్భంగా ఎప్పటిలాగానే స్టేజ్ మీద.. ఆడియో వేదిక వద్ద.. తనకు సాంప్రదాయమైన రిలీజ్ డేట్ ప్రకటించే ప్రక్రియను మరోసారి చేపట్టాడు మహేష్.
తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం అభిమానులేనని, వారిని తన గుండెల్లో పెట్టుకుంటానన్నారు. ఎవరిమీదనైనా ఎక్కువ ప్రేమ ఉంటే వారి గురించి ఎక్కువగా మాట్లాడం. అందుకే మీ గురించి నేను కూడా ఎక్కువ మట్లాడనంటూ పేర్కొన్నాడు. “ఇక మనకు బ్రహ్మోత్సవం మొదలయ్యేది మే 20 నుండి. ఆరోజునే మన పండగ మొదలవుతుంది” అంటూ మహేష్ అసలు విషయం చెప్పాడు. అయితే మహేష్ అభిమానులు మాత్రం మే 20 వరకు ఆగడం లేదు.. ఇప్పటి నుంచి బ్రహ్మోత్సవం సినిమా విజయోత్సవాలను నిర్వహిస్తుండడం గమనార్హం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.