Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Brussels airport attacks.. airport closed upto 26th march..

By   /  March 24, 2016  /  Comments Off on Brussels airport attacks.. airport closed upto 26th march..

    Print       Email

Brussels attacks 1ఈ నెల 26వరకు బ్రసెల్స్ ఎయిర్ పోర్ట్ క్లోజ్..

 

InCorpTaxAct
Suvidha

 

బెల్జియం రాజధాని బ్రసెల్స్‌ ఎయిర్ పోర్టును ఈనెల 26 వరకు మూసి ఉంచనున్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే శనివారం నుంచి ఏఏ సర్వీసులను నడపనున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని తెలిపారు.

అసలు ఏం జరిగింది..?

రెండు రోజుల క్రితం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో జంట బాంబు పేలుళ్ళు జరిగాయి. ప్రముఖ ఎయిర్ పోర్ట్.. జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ దగ్గర రెండు చోట్ల జంట పేలుళ్ళు జరిగాయి. ఇక ఈ పేలుళ్ల ధాటికి భవనాల అద్ధాలు ధ్వంసమయ్యాయి.ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. రెండువందలమందికి పైగా పేలుళ్ళ బారిన పడ్డారు. ఘటనా సమయంలో పెద్ద పెద్ద ధ్వనులు రావడంతో.. ఎయిర్ పోర్టులో ఉన్న వారంతా భయాందోళనలతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాది .. ప్యారిస్ లో దాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ ను అరెస్ట్ చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన జరగడంతో అధికారులు ఆ కోణంలో విచారణ జరిపారు. అయితే ఘటనకు తామే కారణమంటూ ఐఎస్ఐఎస్ కూడా ప్రకటించింది.

మరోవైపు.. బ్రస్సెల్స్‌ ఎయిర్ పోర్టులో దాడులకు పాల్పడిన వారిలో ఇద్దరు సోదరులు ఉన్నట్లు భద్రతా దళాలు కనుగొన్నాయి. వారి పేర్లను బెల్జియం మీడియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఖలీద్‌, బ్రహిమ్‌ ఇల్‌ బక్రోయి అనే ఇద్దరు అన్నదమ్ములు ఎయిర్‌పోర్టులో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. అయితే వీరితో పాటు ఉన్న మరో వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడని అక్కడి అధికారుల సమాచారం. ఇతని కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ దాడుల్లో ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న లాచ్ రాయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →