దళితులపై దాడి అమానుషం: బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్ర
తూర్పు గోదావరి జిల్లా సవరపాలెంలో దళితులపై దాడి ఘటనలో బీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని రాజ్యసభలో బీఎస్పీ లేవనెత్తింది. చనిపోయిన ఆవుచర్మాన్ని తీసుకొస్తున్న దళితులపై కొందరు దుండగులు దాడిచేశారని ఆ పార్టీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా అన్నారు. గ్రామస్థుల దాడిలో మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వర్రావు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఎంపీ తెలిపారు. ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించారని ఈ సంద్భంగా ఆయన గుర్తు చేశారు. మోదీ పర్యటన సందర్భంగా దళితులపై దాడి చేయోద్దని.. తనని కాల్చమని ప్రకటించారని అన్నారు. అదే రోజు ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. వాస్తవానికి దళితులు ఆవును చంపలేదన్నారు. చనిపోయిన ఆవుచర్మాన్ని తీస్తుండగా గ్రామస్థులు దాడి చేశారని సభకు తెలిపారు. ఎన్డీయే హయాంలో దళితులపై దేశవ్యాప్తంగా దాడులు పెరిగిపోయాయని సతీష్ చంద్ర మిశ్రా ఆరోపించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.