Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Buffalo is worth 4 crore?

By   /  July 20, 2016  /  Comments Off on Buffalo is worth 4 crore?

    Print       Email

buffaloఓ దున్న రేటు రూ.4 కోట్లు!

 

InCorpTaxAct
Suvidha

 

 

అవును.. మీరు వింటున్న‌ది నిజ‌మే. ఒక దున్న పోతు ధ‌ర‌ రూ.4 కోట్లు. ఏమిటి దాని గొప్ప అని మీరు అనుకుంటున్నారా? అయితే దాని గురించి తెలుసుకోవాల్సిందే. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాకు చెందిన మున్నాసింగ్ కొన్నేళ్ల క్రితం మిగిలిన దున్నపోతుల మాదిరే ఒక దున్నపోతును కొనుగోలు చేశారు. దానికి హీరా అని పేరు పెట్టుకొని అపురూపంగా పెంచాడు. బ్రీడింగ్ కోసం ఈ దున్న దగ్గరకు గేదెలను తీసుకురావటం మామూలే. అలానే హీరాను బ్రీడింగ్ కోసం వినియోగించాడు. అయితే.. హీరా కారణంగా పుట్టిన దూడలు ఆరోగ్యకరంగా ఉండటమే కాదు.. భారీగా పాలిచ్చే గేదెలుగా తయారు కావటం హాట్ టాపిక్ గా మారింది. దీంతో.. హీరా గొప్పతనం గురించి చుట్టుపక్కల ఊళ్లకు పాకిపోయింది. దీంతో.. తమ గేదెల్ని హీరాతో బ్రీడింగ్ చేయించాలంటూ మున్నా సింగ్ ఇంటి వద్ద క్యూ కట్టటం పెరిగింది. డిమాండ్ కు తగ్గట్లే హీరాతో బ్రీడింగ్ చేసేందుకు లక్షలాది రూపాయిలు ఇవ్వటానికి ముందుకు రావటంతో దీని విలువ పెరిగిపోయింది.

ఇదిలా ఉంటే.. హీరాను తనకు ఇచ్చిన పక్షంలో రూ.4 కోట్లు ఇస్తానని ఒక వ్యాపారి చెప్పినట్లుగా మున్నాసింగ్ చెబుతున్నాడు. హీరాను చూసేందుకే చుట్టుపక్కల గ్రామాల నుంచి పలువురు తన ఇంటికి వస్తున్నట్లు గర్వంగా చెబుతాడు. హీరాను అపురూపంగా పెంచటంతో పాటు.. దాన్ని ఆరోగ్యంగా ఉంచటం కోసం చాలానే ప్రయత్నాలు చేస్తుంటాడు.రోజుకు మూడు.. నాలుగు కిలోమీటర్ల వాకింగ్ కు తీసుకెళ్లటం నుంచి నాణ్యమైన ఆహారం దానికి అందిస్తున్నాడు. ఇందుకోసం నెలకు రూ.25 నుంచి రూ.30 వేలు ఖర్చు చేయటం గమనార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →