Loading...
You are here:  Home  >  Politics  >  Delhi Politics  >  Current Article

Bullet Train

By   /  April 21, 2016  /  Comments Off on Bullet Train

    Print       Email

trainస‌ముద్ర భూగ‌ర్భంలో బుల్లెట్ ట్రైన్‌!

 

InCorpTaxAct
Suvidha

 

 

రైల్వే శాఖ తీసుకున్న ఆ నిర్ణ‌యం చాలా సాహాసోపేత‌మైంది. వేల కోట్లు ఖ‌ర్చు పెట్టె చేసే ఆ ప్రయ‌త్నంపై ఇప్పుడు అంద‌రి దృష్టి. ఏమిటో అది తెలుసుకోవాలంటే చ‌ద‌వండి.. ఇప్ప‌టి వ‌ర‌కు నేల‌పై ప‌రుగెత్తిన రైల్లు.. ఇక‌పై భూ గ‌ర్భంలో కూడా ప‌రుగులు తీయ‌నున్నాయి. అంతేకాదు. దాదాపు 508 కిలోమీట‌ర్లు దూరాన్ని కేవ‌లం రెండుగంట్లో గ‌మ్యాన్ని చేర్చ‌నున్నాయి. రూ.97636 కోట్ల‌తో ముంబై నుంచి అహ్మ‌దాబాద్‌వ‌ర‌కు 508 కిలోమీట‌ర్ల మేర స‌ముద్ర అడుగుభాగంలో హైస్పీడ్ రైల్‌కారిడాన్‌ను నిర్మించ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. జ‌లాంత‌ర మార్గంలో ముంబై నుంచి అహ్మ‌దాబాద్‌వ‌ర‌కు రివ్వును ద‌సుకెళ్లే ఈ బుల్లెట్ రైళ్ల‌కు 21 కిలోమీట‌ర్ల ట‌న్నెల్ మార్గం ఉంటుంద‌ని, కారిడార్ మొత్తంలో ఎక్కువ భాగం ఉప‌రిత‌లంపైనే ఉంటుంద‌న్నారు. అరేబియా స‌ముద్ర తీర ప్రాంతంలోని థానే క్రీక్ నుంచి విరార్ వ‌ర‌కు స‌ముద్ర మార్గాన్ని నిర్మించ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 97,636 కోట్లు. ఈ వ్యయంలో 81 శాతం నిధులను జపాన్ నుంచి సమకూర్చుకునంటున్నట్టు అధికారులు వెల్లడించారు. 15 ఏండ్ల మారటోరియంతో ఏడాదికి 0.1 శాతం వడ్డీని 50 ఏండ్లలో చెల్లించే విధంగా ఈ ఏడాది చివర్లో ఒప్పందం జరుగుతుందని, 2018 నుంచి ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.  ఇది పూర్తి అయితే మాత్రం ఎక్కువ దూరాన్ని త‌క్కువ టైంలో చేరుకోవ‌డంతో పాటు స‌ముద్ర భూగ‌ర్భంలో ప్ర‌యాణాన్ని ఎంజాయ్‌చేస్తూ వెళ్ల‌వ‌చ్చు. ఇది ప్ర‌యాణికుల‌కు గొప్ప అనుభూతిని క‌ల‌గ‌జేయ‌డం మాత్రం ఖాయం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →