Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

బ్రతుకు బండి..!

By   /  June 10, 2016  /  No Comments

    Print       Email

13230337_900459320082090_3700746139819660125_nపెను ఆశల గొడవలేని పసందైన బ్రతుకు బండి..!
శ్రమశక్తికి అంకితమీ భారమైన బ్రతుకు బండి..!

భూమాతను నమ్ముకున్న రైతన్నల కేమున్నది..!?
కన్నీళ్ళు కడగండ్లే అన్నమైన బ్రతుకు బండి.!

InCorpTaxAct
Suvidha

చలి ఎండ వానలవే కప్పుకునే కంబళులే..!
ఉరితాళ్ళకు శిరసొంచే ఛిద్రమైన బ్రతుకు బండి..!

ఓదార్పుల సన్నాయితొ లాలిస్తే చాలదు’లే..!
గిట్టుబాటు ధర కోరును నష్టమైన బ్రతుకు బండి..!

ప్రభుతలెన్ని మారిననూ వీరి ఘోష తీరదాయె..!
పోరాడగ వల్లగాక మౌనమైన బ్రతుకు బండి..!

ఓ మాధవ మరి చూపర కాస్త దయను ఇకనైనా..!
ఆలంబన చూప మిగులు..ప్రాణమైన బ్రతుకు బండి..!

 

 

 

Source:  Madhav Rao Koruprolu

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →