టీడీపీకి బుచ్చయ్య చౌదరి రాజీనామా..
టీడీపీలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పలువురు నేతలు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు. దీంతో చాలామంది రాజీనామాల బాట పట్టారు. అయితే వీరిని రాష్ట్రమంత్రులు, సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే పలువురు నేతలను బుజ్జగించారు. ఇక టీడీపీలో ఎప్పటినుంచో ఉంటున్న బుచ్చయ్య చౌదరి కూడా మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించినట్లు బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఎమ్మెల్యేకు మద్దతుగా టీడీపీ నగర అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు సహా కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కూడా రాజీనామాలు చేశారు. సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయడంతో రాజమండ్రి టీడీపీలో కలకలం రేగింది. సామాజిక సమీకరణాలు, ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేశాకే మంత్రులను ముఖ్యమంత్రి ఫైనల్ చేశారని సీనియర్ మంత్రులు చెబుతున్నారు. ఈ అంశంలో ఎమ్మెల్యేలు సానుకూలత ప్రదర్శించాలని బుజ్జగిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.