క్యాంప్‌బెల్ సిటీ కౌన్సిల్ వివక్ష చూపిస్తోంది: పంజాబీ అసోసియేషన్
ఆస్ట్రేలియాలోని క్యాంప్‌బెల్ సిటీ కౌన్సిల్ వివక్ష చూపిస్తోందని పంజాబీ అసోసియేషన్ ఆరోపించింది. ఈ సంఘం అధ్యక్షుడు కుల్దీప్ ఛుఘా ఈ అంశంపై మాట్లాడారు. థోర్న్డోన్ పార్క్‌లో అక్టోబరులో దీపావళి పండుగను జరుపుకోవాలని భావించామన్నారు. దీనికోసం తాము చేసిన దరఖాస్తు చేశామన్నారు. ఈ దరఖాస్తును గత వారం కౌన్సిల్ తిరస్కరించిందని తెలిపారు. 2014లో ఇదే పార్క్‌లో తాము దీపావళి పండుగను జరుపుకున్నామని గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది అనుమతిని నిరాకరించిందన్నారు.
దీపావళి పండుగను జరుపుకోవడానికి అనుమతి ఇచ్చేందుకు మొదట్లో అంతా సజావుగానే సాగిందన్నారు. చివరిలో సమావేశంలో ఇద్దరు కౌన్సిలర్లు వీటో చేయడంతో తీర్మానం వీగిపోయిందన్నారు. చాలామందికి ఈ పండుగ ఆకర్షణీయంగా ఉండదని చెబుతున్నారని అన్నారు. మీరు ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించాలంటే మీరు ఇంగ్లిష్‌లో మాట్లాడాలని తమకు చెప్పారన్నారు. కౌన్సిల్ మీటింగ్‌లో వివక్షాపూరితంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుళ సమాజాన్ని క్యాంప్‌బెల్ సిటీ కౌన్సిల్ స్వాగతించడం లేదన్నారు. తమను ఆస్ట్రేలియన్లుగా వారు భావించడం లేదన్నారు. మమ్మల్ని కౌన్సిల్ సభ్యులు బయటివారిగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. 2014లో జరిగిన ఉత్సవాల్లో దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన 10 వేల మందికి పైగా పాల్గొన్నారన్నారు. ఈ ఉత్సవాలను వేరే చోట జరుపుకొనేందుకు స్థలం కోసం అన్వేషిస్తున్నామన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.