Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Can TDP buy Visweswara Reddy ?

By   /  May 10, 2016  /  Comments Off on Can TDP buy Visweswara Reddy ?

    Print       Email

VISWESWARAREDDYఆ ఎమ్మెల్యేను కొనే ద‌మ్ము టీడీపీకి లేదా?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఒక్క ఎమ్మెల్యేకి రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వ‌ర‌కు ఇచ్చి సంత‌లో ప‌శువుల‌ను కొంటున్న‌ట్లు కొంటున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యేలు నిజంగానే డ‌బ్బుల‌కు అమ్ముడు పోతున్నారా? రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిని చూసి వెళ్తున్నారా? అన్న‌ది ప‌క్క‌న పెడితే మొత్తానికి మాత్రం కొంత‌మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నార‌న్న‌ది మాత్రం వాస్త‌వం. అయితే ఒక ఎమ్మెల్యేమాత్రం  తెలుగుదేశం ప్ర‌భుత్వానికి స‌వాల్ విసురుతున్నాడు. తాను అంద‌రి ఎమ్మెల్యేల మాదిరి కాద‌ని, త‌న‌ను కొన్నే ద‌మ్మూ ధైర్యం తెలుగుదేశం స‌ర్కార్ లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నాడు. ఎవ‌రా ఎమ్మెల్యే.. ఏమా క‌థ అనుకుంటున్నారా… అయితే చ‌ద‌వండి.

రాష్ట్రంలో రోజు ఎవ‌రో ఒక‌రు వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న త‌రుణంలో అనంత‌పురం జిల్లా, ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రెడ్డి విసిరిన స‌వాల్ ప్ర‌స్తుతం చ‌ర్చానియాంశ‌మైంది. వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌కు  అత్యంత విశ్వాసపాత్రుల్లో ఒకరైన విశ్వేశ్వరరెడ్డి.. తనను కొనే దమ్ము తెలుగు దేశం పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. తనకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పిలుపు వచ్చినట్లు.. తాను సుముఖంగా ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఐతే తనను కొనుగోలు చేసే దమ్ము.. ధైర్యం ఏ తెలుగుదేశం నాయకుడికి ఉందో చెప్పాలని ఆయన స‌వాల్ విసురుతున్ఆన‌డు. తెలుగుదేశం మైండ్ గేమ్ ఆడుతోంద‌ని, ఇక ఇలాంటి ఆట‌లు సాగ‌వ‌న్నారు. వైసీపీని వ‌దిలి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే బుద్ధిచెబుతార‌ని  విశ్వేశ్వ‌ర‌రెడ్డి అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →