Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

‘Cash-for-vote’ scandal is still haunting Chandrababu Naidu

By   /  May 21, 2016  /  Comments Off on ‘Cash-for-vote’ scandal is still haunting Chandrababu Naidu

    Print       Email

jaganబాబును వెంటాడుతున్న ఓటుకు నోటు కేసు

 

InCorpTaxAct
Suvidha

 

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకున్న `ఓటుకు నోటు` కేసు బాబును నేటికీ వెంటాడుతూనే ఉంది. ఇది బాబుతో పాటు మంత్రుల‌కు కూడా ఇబ్బందిగా మారింది. ఏం మాట్లాడాల‌న్నా.. ఏం చేయాల‌న్నా కూడా బాబు అవినీతి గురించి, బాబు ఓటుకు నోటు గురించి మీడియా కూడా ప్ర‌శ్నిస్తుండ‌డంతో మంత్రులు సైతం స‌మాధానాలు చెప్పుకోలేక చిన్న‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ విషయాన్ని బాబు ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌గా దానికి బాబుకూడా మౌనం పాటించ‌మ‌ని చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే ఆ కేసులో దొరిక‌న‌ప్పుడు చంద్ర‌బాబును తెలంగాణ ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ‘చంద్రబాబూ నువు దొరికిన దొంగవు. నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు’ అని సంగ‌తి కేసీఆర్ తో పాటు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మ‌రిచిపోయారేమో కానీ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం మ‌రిచిపోవ‌డం లేదు.
ఇటీవ‌ల కర్నూలు మూడు రోజులు జలదీక్ష చేసిన జగన్ ఇదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిన సీఎం చంద్రబాబునాయుడు కేవలం ఓటుకు నోటు కేసు కారణంగానే కెసీఆర్ ను ఎదిరించి మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. కెసీఆర్ అంటే బాబుకు భయం అని..ఆయన ఒక్క సంతకతం చేస్తే చంద్రబాబు జైలుకు వెళ్ళాల్సిందేనని పదే పదే వ్యాఖ్యానించటం ద్వారా ఈ అంశం మరుగునపడిపోకుండా చూస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలో చంద్రబాబు అనుసరిస్తున్న మెతకవైఖరికి ఈ కేసే కారణం అనేది ప్ర‌జ‌ల్లోకి జ‌గ‌న్ బ‌లంగా తీసుకెళ్తున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →