Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Cash On Vote Case: update..

By   /  February 16, 2016  /  Comments Off on Cash On Vote Case: update..

    Print       Email

HIGH COURT OF AP

ఓటుకు నోటు కేసు.. హై కోర్టును ఆశ్రయించిన మత్తయ్య..

InCorpTaxAct
Suvidha

 

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోమారు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈకేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మత్తయ్య ఇంటికి వెళ్ళి ఏసీబీ అధికారులు తాఖీదులు ఇచ్చివచ్చారు. వారం రోజుల్లోగా తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కావాలని సూచించారు. దీనిపై జెరూసలెం మత్తయ్య హై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు భిన్నంగా ఏసీబీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన అంటున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో మత్తయ్యను మినహాయించాలని, అతని అరెస్ట్ మీద స్టే విధిస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విషయమై మత్తయ్య ఏసీబీని ప్రశ్నించగా.. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాము నోటీసులు ఇచ్చామని తెలిపారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశంలో ఏసీబీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని మత్తయ్య భావిస్తున్నారు. తన హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని రిజిస్ట్రార్‌కు చేసిన ఫిర్యాదులో మత్తయ్య పేర్కొన్నారు. తాను విచారణకు వెళ్లాలా.. వద్దా.. అనే విషయంపై హైకోర్టు సూచించాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై ఒకట్రెండు రోజుల్లో హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →