World Telugu Literary event in Singapore

సింగపూర్‌లో ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలు తెలుగు నేర్చుకునేవాళ్ల సంఖ్య నానాటికి తగ్గిపోతున్నారు. తెలుగు మాట్లాడేవారు కూడా తగ్గిపోతున్నారు. పరభాష ఆంగ్లంపై మక్కువ పెంచుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో కొంతమంది భాషాభిమానులు తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచ దేశాల్లో ఎలుగెత్తి చాటుతున్నారు. అందులో భాగంగానే ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలను నవంబర్ 5, 6 తేదీల్లో సింగపూర్‌లో నిర్వహించనున్నట్టు లోక్‌నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వంగూరి ఫౌండేషన్ అధ్యక్షుడు వంగూరి చిట్టన్రాజు తెలిపారు. […]
Read More →దిగ్విజయంగా ముగిసిన మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం

ఆగస్ట్ 19, 20, 21 (2016) తేదీలలో సాయంత్రం హైదరాబాద్ లో శ్రీ త్యాగరాజ గాన సభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం విజయవంతంగా జరిగింది. పలు రాష్ట్రాలు, నగరాల నుండి సుమారు 100 మంది మహిళా రచయితలూ, సాహితీవేత్తలూ ఈ మహా సభలలో పాల్గొని ప్రసంగించారు. మొదటి రోజు (ఆగస్ట్ 19, 2016) సాయంత్రం 6 గంటలకి సుప్రసిద్ధ రచయిత్రి డి. కామేశ్వరి గారి జ్యోతి […]
Read More →Telugu Literature: “కృష్ణా పుష్కర నీరాజనం”

కృష్ణా పుష్కరాల సందర్భంగా “ఆకాశవాణి – హైదరాబాదు కేంద్రం” వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో నేను గానం చేసిన పద్య కవిత : “కృష్ణా పుష్కర నీరాజనం” ———————————– రచన : “పద్య కళాప్రవీణ” డా. ఆచార్య ఫణీంద్ర ———————————————————- నీరము పుట్టి విష్ణుపద నీరజ యుగ్మమునందు గంగయై, పారుచు దేవలోకముల పావనమై, శివ శీర్షమెక్కి, తా జారి ధరిత్రి సాగి పలు స్థానములందు జనోపయోగమై, చేరె సముద్ర గర్భమున జీవనదీ నద సంవిధానమై! “కన్య” రాశిన్ […]
Read More →Telugu Ghazal: పథమందని వెన్నెలవా..!

విరహాలను కవ్వించే నులివెచ్చని వెన్నెలవా..! తలపువీణ సవరించే బహు తియ్యని వెన్నెలవా..! ఏ గులాబి రేకులపై ఊసులెన్ని వ్రాసేవో..! అమృతధార పొంగించే మరులారని వెన్నెలవా..! చేమంతుల ఎదలోయల సొగసులేల నింపేవో..! పసిడి వెలుగు లూరించే సిరి వాడని వెన్నెలవా..! కలహంసల మధుపాత్రల సాక్ష్యమేల నిలిచేవో..! శిశిరాలను మరపించే పరుగాగని వెన్నెలవా..! సంపెంగల పరిమళాల రథమునేల నడిపేవో..! గంధాలను అలరించే పని మానని వెన్నెలవా..! కాలాలకు అతీతమే ఈ మాధవ పదమేదో..! ఎడబాయక పలికించే పథమందని వెన్నెలవా..! Author: […]
Read More →Happy Friendship Day

ఓ ప్రియమైన స్నేహితుడా ! (గీతం) రచన : డా.ఆచార్య ఫణీంద్ర నీ హృదయంలో నా స్వప్నాలు నెలకొని ఉన్నాయి – నా హృదయంలో నీ భావాలు బలపడి ఉన్నాయి – కళ్ళు నాలుగైనా, చూసే దృశ్యమొకటేలే ! కాళ్ళు నాలుగైనా, చేరే గమ్యమొకటేలే ! ఓ ప్రియమైన స్నేహితుడా ! నువ్వు, నేను – పాలు, మీగడ ! || ఓ ప్రియమైన || పై పై మెరుగుల బహుమతి కాదు […]
Read More →Telugu Ghazal: విమర్శించు తత్వమేల

పూవులేల పూజసేయ..భక్తి సుమము చాలునుగా..! పట్టుపుట్ట మది ఏల..తలపు పట్టు చాలునుగా..! శాంతి కొరకు వెతుకులాట..అశాంతి పాల్జేయును కద..! అలుపుమిగులు పరుగులేల..శ్వాస ఇల్లు చాలునుగా..! చెలిమిమూట గాక గొప్ప నిధి ఉందా లోకంలో..!? ఏవేవో కోర్కెలేల..ఎదురు చూపు చాలునుగా..! కోపంతో సాధించే వస్తువెంత సుఖమిచ్చును..!? తపము లేక తాపమేల..ప్రేమధనము చాలునుగా..! కోటికోట్ల దైవాలే ఉండిరి కద ఎదలోనూ ఎట్టఎదుట..! చూడలేని గొడవలేల..సత్యమతము చాలునుగా..! ఈ మాధవ..వేదనలో దాగున్నది వేదవిద్య..! విమర్శించు తత్వమేల..మౌన వ్రతము చాలునుగా..!! Author: Madhav […]
Read More →పరుగుల ఆటే జీవితం..!

చిరుచిరు నవ్వుల పడవే జీవితం..! వెన్నెల పువ్వుల వనమే జీవితం..! మాటల కందని మౌనం లోపలే.. వాడని వన్నెల కోటే జీవితం..! సుఖమయ తీరాలన్నీ ఇచ్చటే తరగని పరుగుల ఆటే జీవితం..! బాధను ముల్లుగ తలచుట భావ్యమా.. వేదన మాటున పాటే జీవితం..! పరులై ఎవ్వరు లేరీ లోకంలో.. పరిమళ చందన తరువే జీవితం..! మాధవ గజలుకు చెలిమే ప్రాణం..! వెలిగే అక్షర సిరియే జీవితం..! Author: Madhav Rao Koruprolu
Read More →Telugu Ghazal

నిండు కుండ తొణకనీకు పరవశించు ముచ్చటలో..! పండు వెన్నెలంటి సొగసు పరిమళించు ముచ్చటలో..! ఊహలోని మధువనమే సొంతమవని యవ్వనమౌ..! కనురెప్పలు వాలవులే కలవరించు ముచ్చటలో..! చిరునవ్వుల కాంతిపూలు వాడనీకు నీ మోమున..! వెంటాడే వలపువాన మోహరించు ముచ్చటలో..! ఏ కుంచెకు అందవుగా నీ తలపుల సోయగాలు..! ఎదురొచ్చే మెరుపుగీతి ఆలకించు ముచ్చటలో..! నాట్యమాడు గాలులకే గాలమేయు నీ చూపులు..! చిత్రమైన కాలాలను ఆరగించు ముచ్చటలో..! ఈ మాధవ పదములనే అల్లుకున్న భావనమా..! మధురమౌన గగనాలే ముట్టడించు ముచ్చటలో..!! […]
Read More →Tamil poet Gnanakkoothan passes away.

புதுக்கவிதை முன்னோடிகளில் ஒருவரான கவிஞர் ஞானக்கூத்தன் காலமானார். 1938ல் மயிலாடுதுறை அருகே பிறந்த ஞானக்கூத்தனின் இயற்பெயர் ரங்கநாதன். 1968-ல் கவிதைகளை எழுத தொடங்கினார் ஞானக்கூத்தன். இன்றைய நவீன கவிதைகளின் முன்னோடிகளில் மிக முக்கியமானவர். ழ, கசடதபற, கவனம் ஆகிய சிற்றிதழ்களின் ஆசிரியர் குழுக்களில் ஞானக்கூத்தன் இடம்பெற்றிருந்தார். ‘அன்று வேறு கிழமை’, ‘சூரியனுக்குப் பின் பக்கம்’, ‘கடற்கரையில் ஒரு ஆலமரம்’ போன்றவை ஞானக்கூத்தன் கவிதைத் தொகுப்புகளில் குறிப்பிடத் தகுந்தவை. சமீபமாக, உடல்நிலை சரியில்லாமல் சிகிச்சை பெற்று வந்த ஞானக்கூத்தன் […]
Read More →