Loading...
You are here:  Home  >  Literature  >  Telugu Ghazals
Latest

Telugu Ghazal: ఊయలంటి ఈ తనువున..విశ్రమించు తీరేమో..

By   /  April 8, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

ఎన్నికోట్ల ధనమున్నా..పట్టుకెళ్ళు వారెవరో..!? చిరునవ్వుల పూలతోట..దోచుకెళ్ళు వారెవరో..!? నడచువేళ నడకగాక..ఆలోచన వేరేలనొ.. యుద్ధంలో ఓ సాక్షిగ..దూసుకెళ్ళు వారెవరో..!? ప్రమాదాల హరివిల్లే..పాఠాలను నేర్పుతుంది.. ఓ ప్రార్థన గీతమవుతు..ముందుకెళ్ళు వారెవరో..!? గరికకేమి తెలిసి అలా..పాలు నింపుకుని ఉందో.. ఎఱుకయేటి దురు సరిగ..ఈదుకెళ్ళు వారెవరో..!? ఊయలంటి ఈ తనువున..విశ్రమించు తీరేమో.. దాచుకున్న శ్వాసలోకి..లోతుకెళ్ళు వారెవరో..!? నమ్మకాల ముళ్ళచెట్లు..కాల్చలేని తనమెందుకు.. ప్రశ్నించే వసంతాలు..మోసుకెళ్ళు వారెవరో..!? సూర్యుడేమి చేస్తాడోయ్..కనులు నీవు విప్పకున్న.. మాధవుడా తనదీపం..నిలుపుకెళ్ళు వారెవరో..!? Author: Madhav Rao Koruprolu

Read More →
Latest

Telugu Ghazal: అందెల కదలిక మౌనపు గుడిలో..

By   /  February 21, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

హంసల దీవియె తనువై నీవే..! బంగరు వీణయె తనువై నీవే..! చదువుల రాజ్యం బొమ్మల కొలువే.. కన్నుల పంటయె తనువై నీవే..! రాగం తానం పల్లవి వినుమా.. శ్వాసల సాక్షియె తనువై నీవై..! అందెల కదలిక మౌనపు గుడిలో.. ఆశల ఆటయె తనువై నీవే..! కలలకు రెక్కలు తొడిగే ముచ్చట.. అక్షర కోటియె తనువై నీవే..! మాయల అద్దం మనసే మాధవ..! వీడని కోటయె తనువై నీవే..! Author: MadhavRao Koruprolu

Read More →
Latest

Telugu Ghazal: మరిగే క్షణాల..మబ్బుల నదిలో..!

By   /  February 20, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

పాటల ఊయల..చూపుల నదిలో..! ఊహల వెన్నెల..సొగసుల నదిలో..! మనసున పొంగే..రాగం ఏదో.. మౌనపు కోవెల..మధువుల నదిలో..! తనువే తియ్యని..ఆశల తీవగ.. అందిన అందెల..మెఱుపుల నదిలో..! నవ్వీనవ్వని..అరవిరి మొగ్గలు.. వసంత కోకిల..వలపుల నదిలో..! చిక్కని తరగని..ఆవిరి కొండలు.. మరిగే క్షణాల..మబ్బుల నదిలో..! మాధవ గజలే..చుట్టే వేళల.. పదాల స్వరాల..వెలుగుల నదిలో..! Author: Madhav Rao Koruprolu

Read More →
Latest

Telugu Ghazal: ప్రతిభను మెచ్చే..జనులే విజ్ఞులు..

By   /  February 4, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

నచ్చిన సంగతి..తోచును తియ్యగ..! నచ్చని ముచ్చట..గుచ్చును తియ్యగ..! ప్రతిభను మెచ్చే..జనులే విజ్ఞులు.. విమర్శ నిప్పై..కాల్చును తియ్యగ..! మంచిని చెడుగా..తలచుట జరుగును.. అనుభవజ్ఞానం..మార్చును తియ్యగ..! కత్తుల నగరిలొ..బాంబుల యుద్ధం.. వీడని..ముంచును తియ్యగ..! మాటలు చూపులు..శాంతించేనా.. తలపులు నిలచిన..తెలియును తియ్యగ..! తీపికి చేదుకు..తేడా..లేదుర.. మాధవ గజలున..మ్రోగును తియ్యగ..! Author: Madhav Rao Koruprolu

Read More →
Latest

Telugu Ghazal: నీ తియ్యని లోకంలో..నను మాయం చేస్తావుగ..!

By   /  January 18, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

పరిమళించ లేకున్నా..ఆనందం ఇస్తావుగ..! ముళ్ళమధ్య నీవున్నా..అను’రాగం పూస్తావుగ..! అమ్మలాగ నీడనిచ్చు..నీ తత్వం అమోఘం.. మౌనంగా నీ స్నేహం..అను’బంధం వేస్తావుగ..! నా తోటకు కంచెలాగ..ఉంటావే శాశ్వతంగ.. నా శ్వాసల కాన్వాసున..ఓ చిత్రం గీస్తావుగ..! గరికనైన గులాబినైన ఒకేలా చూడగలవు.. నాది కాని నా ప్రతిభతొ..ఓ కావ్యం వ్రాస్తావుగ..! ఈ అక్షర యజ్ఞంలో..ప్రతిమాటా మంత్రమేగ.. నీ తియ్యని లోకంలో..నను మాయం చేస్తావుగ..! మాధవుడా..ఏమిటసలు..నీ గానం సౌందర్యం.. నిద్దురలో మెలకువలో..నా హృదయం..కోస్తావుగ..! Author” Madhav Rao Koruprolu

Read More →
Latest

Telugu Ghazal: అలాతిరిగి ఉన్నాసరె అటే వత్తు నేను..

By   /  January 13, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

గజల్ 1326. నీ తలలో మల్లియలా మిగలాలని ఉంది..! నీ కన్నుల తడిచాటున ఒదగాలని ఉంది..! అలాతిరిగి ఉన్నాసరె అటే వత్తు నేను.. నీ పెదవుల మెఱుపుతీవ కావాలని ఉంది..! ఆశకేమి తెలియదులే నా ప్రేమ అర్థం.. నీ కలలకు పానుపుగా మారాలని ఉంది..! ఏ పూవులు బాణాలుగ వేయలేను చూడు.. నీ మౌనపు వెన్నెలలో ఆడాలని ఉంది..! రాలుతున్న చెమటచుక్క గాలికలుసు కాదు.. పవిత్రతకు క్రొత్తర్థం చెప్పాలని ఉంది..! ఈ చెలిమిని ఓ కలిమిగ నిలుపుతున్న […]

Read More →
Latest

Telugu Ghazal: ఏడుపంతా తొలగిపోవును..జ్ఞానచక్షువు తెరచి చూస్తే..!

By   /  January 3, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

కోటి సూర్యుల కోవెలంటే..నుదుటి నేత్రమె తరచి చూస్తే..! మరణమన్నది ఎక్కడున్నది..కన్నులారా నిలచి చూస్తే..! ప్రమాదాలను సృష్టిజేసే..మనసు చిత్రము తెలియవేలా.. మంత్రతంత్రము లన్ని ముసుగులె..కాస్త శ్రద్దగ తలచి చూస్తే..! గుండెలయలను అనుసరించే..విద్య ఏదో పట్టవలెనిక.. శ్వాస వీణను మీటు వేళ్ళను..చెలిమిమీరగ వలచి చూస్తే..! మాయఖర్మము చుట్టుకున్నది..కర్మచక్రము లేదు విడిగా.. ఏడుపంతా తొలగిపోవును..జ్ఞానచక్షువు తెరచి చూస్తే..! కలల పక్షుల విరహవేదన..తీర్చు హంసల గగనమదుగో.. నేను నాదను భావసంపద..మరచి హృదయము పరచి చూస్తే..! గజల్ మాధవ అక్షరాలకు..అద్దమంటే మౌనవనమే.. జపము స్మరణలు […]

Read More →
Latest

Telugu Ghazal: పరిమళిస్తూ రాలిపోవు..పూల బాలనైతె చాలు..!

By   /  January 3, 2017  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

అదేపనిగ చదువుకునే ప్రేమ లేఖనైతె చాలు..! పరిమళించు అందమైన తీపి ఊహనైతె చాలు..! నీ హృదయపు కోవెలలో వెలుగు దీపశిఖ ఏదో.. చూస్తు అలా తేలిపోవు..పక్షి పాటనైతె చాలు..! విరహమధువు గ్రోలుతున్న  తుమ్మెదలా ఎందుకిలా..?! నీ వెలుగున ఆడుకునే..మబ్బు తునకనైతె చాలు..! ఏ వాసన లేని పూలతీవలాగ బ్రతకటమా..!? పరిమళిస్తూ రాలిపోవు..పూల బాలనైతె చాలు..! మట్టిగుండె లయమాటున నిశ్చలమౌ ప్రాణసఖీ.. లాలనలకు అతీతమౌ..చెలిమి వీణనైతె చాలు..! ఈ మాధవ గజల్ సొగసు చూడాలిక అరకన్నుల.. చెప్ఫరాని భావాలకు..ప్రేమమాలనైతె […]

Read More →
Latest

Telugu Ghazal: నాకే నీ ధ్యానంలో ఉన్నానని తెలియలేదు..!

By   /  December 28, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

కలలోలా నీవు ఎదురు..వస్తావని తెలియలేదు..! నా మనసును నీకు వ్రాసి..ఇచ్చానని తెలియలేదు..! జ్ఞాపకాల వెన్నెలయే జన్మలుగా తాడు కదా..! అమృతమేదొ..విషమేదో..తెలియాలని తెలియలేదు.. గున్న కొమ్మలలో కోకిలలా పాడలేను.. ఆ’వేదన మధువులాగ మింగాలని తెలియలేదు..! మనప్రేమకు స్నేహానికి..కల్యాణము జరిగేనిక.. నాకే నీ ధ్యానంలో ఉన్నానని తెలియలేదు..! విరహానికి తేనెటీగ..కుట్టిందట రెప్పలపై.. మననడుమన తనకు చోటు చూపాలని తెలియలేదు..! ఈ మాధవ గజల్ పూలె మన పెండ్లికి తలంబ్రాలు.. ఇలా మౌన హారతి’నే పట్టాలని తెలియలేదు..! Author: Madhav Rao […]

Read More →
Latest

Telugu Ghazal: వేనవేల తారకలను పోతపోయ తరమె..!?

By   /  December 28, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

నీ చూపే ఆద్దమంటి పాఠంలా ఉంది..! నీ నవ్వే చేమంతుల రాగంలా ఉంది..! ఆలోచన వర్ణించగ అక్షరాలు ఏవి..!? నీ తలపే ఇంద్రచాప నగరంలా ఉంది..! అమృతాన్ని వర్షించే మేఘాలా ఎచట..!? నీ మౌనం ప్రాణవేద గగనంలా ఉంది..! వేనవేల తారకలను పోతపోయ తరమె..!? నీ సొగసే మెఱుపుపూల పద్మంలా ఉంది..! పసిడిపంట చేలగాలి ఓణీ కద నీకు.. నీ నడకే సుస్వరాల ఛందంలా ఉంది..! మాధవుడే దాసుడులే మెలకువైన నీకు.. నీ పలుకే దివ్యలోక దీపంలా […]

Read More →