వైసీపీ అధినేత జగన్ కు షాక్..?
వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ కు షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న ఆయనకు సీబీఐ షాక్ ఇచ్చింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేసింది. బెయిల్ నిబంధనలను ఆయన ఉల్లంఘిస్తున్నారంటూ పిటిషన్ లో తెలిపింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పేర్కొంది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 7న కౌంటర్ వేయాలని జగన్ కు సూచించింది.
జగన్ కు చెందిన వార్తా సంస్థలో గతంలో సీఎస్ గా పనిచేసిన రమాకాంతరెడ్డి ఇంటర్వ్యూ ప్రసారం చేశారు. దీనిగురించి సీబీఐ తన పిటిషన్ లో పేర్కొన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉందని సీబీఐ పేర్కొంది. దీంతో న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. జగన్ పై వేసిన కేసు నిలవదని గతంలో సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ తనతో అన్నట్లుగా రమాకాంతరెడ్డి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అలాగే సీబీఐ దర్యాప్తు మీద తనకు ఏ మాత్రం నమ్మకం లేదని అన్నారు.సీబీఐ అధికారులకు సెక్రటేరియట్ నిబంధనలు తెలియవని అన్నారు. ఇదిలాఉంటే జగన్ అరెస్టుకు రంగం సిద్దం అవుతోందని గత ఏడాది డిసెంబర్ లో ప్రచారం సాగిన విషయం తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.