ఢిల్లీలో ఆ ఆశ్రమం అత్యాచారాల అడ్డా.. సీబీఐ విచారణ..!
దేవుడి బోధనలు నేర్పుతామని చెప్పి అమ్మాయిలను ఆశ్రమానికి తీసుకొచ్చి ఘోర అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత ఆ బాలికలను అక్కడే బంధించి వారిపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దేశరాజధాని నడిబొడ్డు రోహిణి ప్రాంతంలో ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయ ఆశ్రమంలో కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ దురాగతం ఈ మధ్యనే వెలుగు చూసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
ఇంత జరుగుతున్నా పోలీసులకు ఎందుకు పట్టింపు లేకుండా పోయిందని ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ పోలీసుల బృందం, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలైవాల్ బృందం ఏకకాలంలో ఆశ్రమంపై దాడి చేశారు. ఇక్కడ అమ్మాయిలపై అనేక సార్లు అక్కడి సాధువులు లైంగిక దాడులకు పాల్పడినట్లు కూడా పోలీసులు కోర్టుకు తెలిపారు. కాగా ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించి, 15 రోజుల్లోగా ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని సూచించింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.