Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

CBN launches double Bed Room scheme on the occasion of Ambedkar’s 125th Jayanti

By   /  April 13, 2016  /  Comments Off on CBN launches double Bed Room scheme on the occasion of Ambedkar’s 125th Jayanti

    Print       Email

Chandrababu16 ల‌క్ష‌ల డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లకు బాబు శంకుస్థాప‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ ముఖ్య‌మంత్రికంటే స్పీడుగా వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారుకానీ.. తెలంగాణ సీఎం కంటే ఏపీ సీఎం కొంచెం స్పీడు పెంచాడు. అందులో భాగంగానే గురువారం డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌కు చంద్ర బాబునాయుడు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 125వ జ‌యంతి సంద‌ర్భంగా ఏపీలో పెద్ద ఎత్తున చేప‌ట్ట‌బోయే ఈ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను రూ.16వేల కోట్ల‌తో నిర్మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొద‌టి విడ‌త‌లో 6 ల‌క్ష‌ల డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను చేప‌ట్ట‌నుండ‌గా గురువారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు కృష్ణా జిల్లా జ‌క్కంపూడిలో 10వేల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్ర‌బాబు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.
కాగా విజయవాడ నగరంలో కాల్వగట్లపై ఉంటున్న దాదాపు 8,300 కుటుంబాలను జక్కంపూడి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకాల కింద 4 లక్షల ఇళ్లు, గృహ నవీకరణ కింద 1.50 లక్షల ఇళ్లతో పాటు 50వేల ఇతర గృహాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాగా పేద‌ల‌ను చంద్ర‌బాబుప‌ట్టించుకోవ‌డం లేద‌నే అప‌వాదు ఇటీవ‌ల పెరుగుతుండ‌డంతో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌తోనైనా ఆ మ‌చ్చ‌ను పోగొట్టుకోవాల‌ని బాబు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →