Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

CBN speech at AP, Temporary Secretariat Foundation ceremony

By   /  February 17, 2016  /  Comments Off on CBN speech at AP, Temporary Secretariat Foundation ceremony

    Print       Email

temparary secre't - sankustapana- cm cbn-A

ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్ కి శంకుస్థాపన..

InCorpTaxAct
Suvidha

 

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 45.129 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. అంతకు ముందు నల్లూరు పండితులు శంకుస్థాపన ప్రాంతంలో ధాతుస్థాపన, రత్నాన్యాసం, ఇష్టికాన్యాసం పూజలు నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు, ఏపీ మంత్రులు చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌, పరిటాల సునీత, పీతల సుజాత, ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు సహా పలువురు టీడీపీ నేతలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఏపీ నుంచే పరిపాలన.. అందుకే సచివాలయ భవన నిర్మాణం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుtemparary secre't - sankustapana- cm cbn - C

ఏపీ రాజధాని అమరావతిలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామ పరిధిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కింద భూములు ఇవ్వాలని కోరితే.. రైతులు స్పందించి.. స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని ప్రశంసించారు. భూములు ఇచ్చిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలన హైదరాబాద్ నుంచి కాకుండా ఏపీ నుంచి చేయాలని తమ ఆకాంక్ష అని తెలిపారు. అందుకే తాత్కలిక సెక్రటేరియట్ భవన నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అయితే ఇవి తాత్కలిక భవనాలు మాత్రం కావని.. శాశ్వతమైనవని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన తీరు ఎంతో ఆవేదన కలిగించిందని చంద్రబాబు అన్నారు. అనైతికంగా విభజన చేశారని ఆరోపించారు. అందరూ అసూయ పడేలా రాజధాని నిర్మాణం ఉండాలనేది తమ అభిప్రాయమన్నారు. విభజన వల్ల నష్టపోయామని నిరుత్సాహ పడకుండా.. ఎదురైన సంక్షోభాన్ని అవకాశంలా తీసుకోవాలని సూచించారు. విజయవాడలో ఇంటి అద్దెలు దారుణంగా ఉన్నాయని.. యజమానులు మంచి మనసుతో ఆలోచించి సహకరించాలన్నారు. కుల, మత, ప్రాంతాల పేరుతో కొంతమంది విద్వేషాలు రగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ సమగ్ర లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →