ఒక్కసారి కమిట్ అయితే కేంద్రం అంతే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు కూడా నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తోంది. పైగా తాము ఇచ్చేది ఇంతే అంతకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వలేం అని స్పష్టంగా చెబుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పరిష్కరించుకోవాల్సింది పోయి అవేమీ తనకు పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. అయితే ఇన్ని రోజులుగా అది చేస్తాం.. ఇది చేస్తామంటూ మాయ మాటలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేయడంతో రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే అన్నీకోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న తమ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి పట్టించుకోకపోవడం బాధకరం. అయితే ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకూ కేటాయించిన రూ.2050కోట్లు ఇచ్చిందని, ఆ మొత్తంతోనే సరిపెట్టుకోవాలని కేంద్ర సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా ఇందులో విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కేటాయించిన వెయ్యి కోట్లను మినహాయించి మరో రూ.2500కోట్లు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
కేంద్రం అందుకు ఎంతమాత్రమూ అంగీకరించలేదని తెలిసింది. విభజన చట్టంలోని 94(3)సెక్షన్ ప్రకారం రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవన నిర్మాణాలకు మాత్రమే కేంద్రం సాయం చేయాలని స్పష్టంగా ఉందని, ఈ భవనాలన్నీ రూ.2050 కోట్లతోనే నిర్మించుకోవచ్చనిది సాధ్యం కాదని భావిస్తే మాత్రం కేంద్రమే ఎన్బీసీసీ ద్వారా ఈ భవనాలను నిర్మించి ఇస్తుందని ఆర్థికశాఖ స్పష్టం చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.200కోట్లను వచ్చే ఎనిమిది సంవత్సరాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేటాయించాలని సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రధాని నరేంద్ర మోడీని అడుగుతుంటే కేంద్ర ఆర్థిక శాఖ మాత్రం జిల్లాకు రూ.50కోట్లు చొప్పున మరో నాలుగేళ్లకు మాత్రమే ఇస్తామని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేయడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.