Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Central Government shocks Chandra Babu Naidu

By   /  July 4, 2016  /  Comments Off on Central Government shocks Chandra Babu Naidu

    Print       Email

chandra babu speechబాబుకు కేంద్రం షాక్‌?

 

InCorpTaxAct
Suvidha

 

 

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో.. విశాఖ‌కు రైల్వే జోన్ విష‌యంలో … పోల‌వ‌రం ప్రాజెక్టు నిధుల విష‌యంలో రాష్ట్రానికి ప‌లు మార్లు షాక్‌లు ఇచ్చిన కేంద్ర స‌ర్కార్ . తాజాగా ప‌ట్టిసీమ విష‌యంలో మ‌రోమారు షాక్ ఇచ్చింది. దీంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ప‌ట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీ నింపుకుని కృష్ణా నదినీటిలో ఏపీకి వాటాగా లభించే నీటిని రాయలసీమకు తరలించ‌డంతో పాటు కృష్ణా డెల్టాలో రెండు పంటలకు నీరివ్వవచ్చని బాబు ఆశించారు. అయితే దీనికి విరుద్ధంగా అనేక నిబంధనలతో కూడిన హైడ్రాలజీ అనుమతులను కేంద్ర జలసంఘం జారీ చేసింది. సీడబ్ల్యూసీ తాజాగా పంపిన లేఖలో అనేక పరిమితులను  విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించే నీటిని కేవలం తాగునీరు – పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. గోదావరి నదికి వరదలు వచ్చే కాలంలో జులై నుంచి నవంబర్ మధ్యకాలంలో మాత్రమే నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించుకోవడానికి కేంద్ర జలసంఘం అనుమతించింది.

పోలవరం ప్రాజెక్టు ఇంకా నిర్మించక పోవడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద డెల్టా అవసరాలు తీరిన తర్వాత వృథాగా పోయే నీటిని ప్రాతిపదికగా తీసుకుని మిగులు జలాలను అంచనా వేయాలని కోరింది. కేవలం పది సంవత్సరాల కాలంలో మిగులు జలాల లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టులో భాగమేనని ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనను కేంద్రం పట్టించుకోలేదు. దీనికి తోడు పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను తెలిపింది. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తూనే మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం అక్రమమని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఈ ఫిర్యాదు  నేపథ్యంలో తాజాగా సీడబ్ల్యూసీ కొత్త నిబంధనలు విధించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →