Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Chal Mohan Ranga Movie Review

By   /  April 5, 2018  /  Comments Off on Chal Mohan Ranga Movie Review

    Print       Email

‘ఛ‌ల్ మోహ‌న్ రంగ’ రివ్యూ

InCorpTaxAct
Suvidha

 

 

 

చిత్రం: ఛల్‌ మోహన్‌ రంగ
నటీనటులు: నితిన్‌, మేఘా ఆకాశ్‌, న‌రేష్‌, లిజీ, ప్ర‌గ‌తి, రావు ర‌మేశ్‌, సంజ‌య్ స్వ‌రూప్‌, మధునందన్‌, రోహిణి హ‌ట్టంగ‌డి, ప్ర‌భాస్ శ్రీ‌ను తదితరులు
క‌థ: త్రివిక్ర‌మ్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌ తమన్‌
ఛాయాగ్ర‌హ‌ణం న‌ట‌రాజ సుబ్ర‌మ‌ణియ‌న్ (న‌ట్టి)
నిర్మాణ సంస్థలు: శ్రేష్ఠ్‌ మూవీస్‌, పీకే క్రియేటివ్‌ వర్క్స్‌
నిర్మాత: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి
ర‌చ‌న‌- దర్శకత్వం: కృష్ణ చైతన్య
విడుద‌ల తేదిః ఏప్రిల్ 5, 2018

డెక్క‌న్ అబ్రాడ్‌: మోహన్ రంగ (నితిన్) జీవితం మీద ఎలాంటి ఆందోళన లేక జాలీగా తిరిగే కుర్రాడు. తన చిన్న నాటి స్నేహితురాలు అమెరికా వెళ్లిందని తెలుసుకుని అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తల్లిదండ్రులు కూడా మోహన్ రంగని మార్చలేరు. ఎలాగోలా యూఎస్ వెళ్లిన నితిన్ అక్కడ మేఘా (మేఘా ఆకాష్)తో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరు కలిసి ప్రయాణం చేయడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే ఇద్దరు ప్రపోజ్ చేసుకోరు ఇంతలోనే కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోతారు. ఇంతకీ మోహన్ రంగ, మేఘా ఎందుకు విడిపోయారు..? వారిద్దరి మళ్లీ దగ్గరయ్యారా..? అసలు కథ ఏంటన్నది తెర మీద చూడాల్సిందే. నితిన్ మిగతా సినిమాల కన్నా ఈ సినిమాలో మంచి ఈజ్ తో నటించాడు. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా మెప్పించింది. సినిమాలో మధునందన్, సత్య కామెడీ బాగుంది. రావు రమేష్, నరేష్ ల పాత్రలు ఆకట్టుకున్నాయి. ఇక మిగతా వారంతా కూడా పరిధి మేరకు నటించారు.


ఏదో ఒక గోల్ తో అమెరికా వెళ్లడం.. అక్కడ హీరోయిన్ ను చూసి హీరో ఫ్లాట్ అవడం. ఇద్దరు ప్రేమించుకున్నా ఒకరికొకరు బయటకు చెప్పుకోకుండా ఉంటారు. చివరి దాకా ఈ తర్జన భర్జన ఫైనల్ గా ఇద్దరు ఓపెన్ అవుతారు. మధ్యలో ట్విస్ట్ ఈ ఇద్దరు చిన్నప్పుడు తెలిసిన వాళ్లే. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. వస్తున్నాయి. కథ పాతదే అయినా కథనంలో కాస్త ఫన్ యాడ్ చేసి మధ్యలో త్రివిక్రం మార్క్ డైలాగ్స్ తో ఎక్కడ బోర్ కొట్టకుండా చేశారు. నితిన్, మేఘా ఆకాష్ ల స్క్రీన్ ప్రెజెన్స్ జోడి కుదిరినట్టు అనిపిస్తుంది. సినిమాలో చెప్పుకునే అంశాలు ఏమి లేవు. లొకేషన్స్ మాత్రం బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా టచ్ అవుతుంది. క్లైమాక్స్ యూత్ ఆడియెన్స్ కు నచ్చేస్తుంది. సినిమా అంతా రొటీన్ గా అనిపించినా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. యూత్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలున్నాయి. ఫ్యామిలీ తో వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు.

ప్ల‌స్ పాయింట్స్‌
నితిన్‌
సంగీతం
సంభాష‌ణ‌లు
కామెడీ
నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్‌
రొటీన్ స్టోరీ
ద్వితీయార్థంలో తొలిస‌గం
చివ‌ర‌గా.. స‌ర‌దా స‌ర‌దాగా.. ‘ఛ‌ల్ మోహ‌న్ రంగ‌’

రేటింగ్‌.. 3/5

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

AP CM Y.S. Jagan’s Dallas meeting is a grand success!

Read More →