Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

బాబు స‌క్కెస్ సీక్రెట్ అదే!

By   /  April 27, 2016  /  Comments Off on బాబు స‌క్కెస్ సీక్రెట్ అదే!

    Print       Email

chandrababuచంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయాల్లో ఇంత స‌క్కెస్‌ఫుల్‌గా రాణించ‌డానికి కార‌ణాలు చాలానే ఉన్నాయి. ప్ర‌తి విష‌యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవ‌డంతో పాటు అది ప్ర‌జ‌ల‌కు ఎంత మేర ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన త‌ర్వాత‌నే ఆ ప‌ని మొద‌లుపెడ‌తారు. ఏదైనా చంద్ర‌బాబు ద‌గ్గ‌రికి ఒక ఫైల్ వ‌స్తే దాన్ని పూర్తిగా చ‌దివిన త‌ర్వాత‌నే ఆయ‌న సంత‌కం పెడ‌తారు. అడ్డ‌దిడ్డంగా సంత‌కాలు పెట్టే అల‌వాటు చంద్ర‌బాబుకు లేదు. అందుకే ఆయ‌నపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం లేదు. తాజాగా తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం  తెల్లవారుజామునే వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం 4.01 గంటలకు ముందే అక్కడికి వెళ్లిన చంద్రబాబు ఉదయం 9 గంటల దాకా అక్కడే ఉన్నారు.

ఈ క్రమంలో ‘ఏపీ గవర్నమెంట్ ట్రాన్సిషనల్ హెడ్ క్వార్టర్స్’గా నామకరణం చేసిన తాత్కాలిక సచివాలయంలో తాను ప్రారంభోత్సవం చేసిన గదిలో చంద్రబాబు కూర్చున్నారు. సచివాలయం ప్రారంభించిన సందర్భంగా లాంఛనంగా రుణమాఫీకి సంబంధించిన ఫైల్ పై ఆయన సంతకం చేశారు.  ఈ సందర్భంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు రూపొందించిన సదరు ఫైలును చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన రెండు పొరపాట్లను ఎత్తిచూపారు. వాటిని సరిచేసిన తర్వాతే సంతకం పెడతానని చెప్పారు. ఇలా ప్ర‌తి విష‌యంలో ప‌ట్టు సాధిస్తుండ‌డం మూలంగానే ఆయ‌న రాజ‌కీయాల్లో స‌క్కెస్ అవుతున్నాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సుధీర్ఘ‌కాలం ముఖ్య‌మంత్రిగా ప‌ని చేయ‌గ‌లుగుతున్నాడు.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →