ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైయస్ఆర్ కాంగ్రెస్ ఇరుకు పెడుతోంది. ఇన్ని ఏళ్ల నుంచి ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబుకు అదే ఢిల్లీలో ఆయన అసలు రంగు భయట పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, పార్టీ ఫిరాయింపుల విషయంలో ఒక్క అంశాన్ని ఆధారాలతో సహా ఢిల్లీ పెద్దలకు చూపిస్తూ అధికార టీడీపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో `సేవ్ డెమోక్రసీ` పేరుతో తన ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లిన వైయస్ జగన్ ఇప్పటికే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా తదితరులను కలుస్తూ బాబుపై వేసిన ` చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్` అనే పుస్తకాన్ని వాళ్ల ఇవ్వడంతో అందులో ప్రతి అంశాన్ని వారికి కూలంకుషంగా వివరిస్తున్నారు.
అయితే వైయస్ జగన్ చెప్పే విషయాలను జాతీయ నేతలు శ్రద్ధగా వింటున్నారు. చంద్రబాబునాయుడు ఇంత అవినీతి పరుడా అంటూ ఆశ్చర్య పోతున్నారు. రెండేళ్లలో రెండులక్షల కోట్లు సంపాదించాడా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక్క భూ దందాలనే దాదాపు లక్ష కోట్లుకు పైగా అవినీతి జరిగిందని వైయస్ జగన్ చెబుతుంటే.. అవునా?.. నిజమా? అంటూ నోరెల్లబెడుతున్నారు. పార్టీ ఫిరాయింపులు కానీ… బాబు అవినీతి సంబంధించి విషయంపై కానీ ఆలోచించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని జగన్‌కు వాళ్లు హామీ ఇచ్చారు. దీంతో బాబు అవినీతిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం కొంతవరకైనా ఫలితంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.