ఆర్భాటంగా ప్రారంభం.. అంతలోనే ఆటంకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మంచి పని మొదలు పెట్టినా అది కలిసి రావడం లేదు. పైగా ఆయనకు చెడ్డపేరు కూడా తెచ్చి పెడుతోంది. బాబుకు కాలం కలిసి రావడం లేదో… లేదా వ్యవస్థలోనే లోపం ఉందా అనుమానం అందరిలో మెదులుతోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల కోసం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రత్యేక రైలును సీఎం చంద్రబాబు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఇద్దరూ కలిసి సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉండే ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఉపయోగపడేలా ప్రారంభించిన ఈ రైలుకు ద్వితియ విఘ్నం తప్పలేదు. విశాఖకు రైల్వే జోన్ రాకపోయినా ఉద్యోగులకు ప్రత్యేక రైలును తెచ్చానని సంబరపడిపోయిన చంద్రబాబుకు షాక్ తగిలేటట్లు చేశారు రైల్వే అధికారులు. మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభమైన ఈ రైలు రెండోవ రోజే ఆగిపోయింది.
సోమవారం సాయంత్రం విజయవాడ నుంచి స్టార్ట్ అయిన ఈ ట్రైన్ సికింద్రాబాద్ కు చేరుకున్నా.. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య పరుగులు తీయాల్సి ఉన్నా.. దీన్ని రైల్వే అధికారులు క్యాన్సిల్ చేశారు. ట్రైన్ ఎందుకు రద్దు అయ్యిందన్న విషయాన్ని చెప్పని అధికారులు.. త్వరలోనే ఈ ట్రైన్ ను షెడ్యూల్ ప్రకారం రెగ్యులర్ గా నడుపుతామని వెల్లడించారు. శుభమా అని కొత్త ట్రైన్ స్టార్ట్ అయ్యాక.. ఈ ద్వితీయ విఘ్నం ఏమిటని పలువురు పెదవి విరుస్తున్నారు. ఆర్భాటంగా స్టార్ట్ చేసిన రైలుబండి రెండో రోజే ఆగిపోవటం ఏమిటా అని అర్థం కాక ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.