వియ్యంకులు కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు?
ఇంతకీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ వియ్యంకులు కావడమేంటి? ఇన్ని రోజులు ఎడమొహం.. పెడమొహంగా ఉన్న ఇద్దరు చంద్రులు ఇక కలహాల కాపురం వదిలి కలిసి మెలిసి ఉంటారా? అసలు ఈ ఇద్దరు చంద్రుల కథేంటి అనుకుంటున్నారా? అయితే తెలుసుకోవాల్సిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకులు అయ్యే అవకాశం ఎలా అంటే.. కేసీఆర్ పెంపెడు కూతురు ప్రత్యూష కర్నూలు జిల్లాకు చెందిన మద్దిలేటిని ప్రేమించటం.. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోవడం తెలిసిందే. సవతి తల్లి చేతిలో చిత్రహింసలు అనుభవించి.. అనంతరం బయటపడిన ఆమెకు తాను అండగా ఉంటానని.. ఆమె బాధ్యతను తాను తీసుకుంటానని కేసీఆర్ చెప్పటం తెలిసిందే.
తాజాగా ఆమె మద్దిలేటితో ప్రేమలో పడిన నేపథ్యంలో.. తన పెళ్లిని కేసీఆర్ చేతుల మీద చేసుకోవాలని భావిస్తోంది. మద్దిలేటి కూడా ప్రత్యూష పెళ్లి కేసీఆర్ చేతుల మీద జరగాలని చెప్పటమే కాదు.. తమ పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించుకొని కేసీఆర్ తో మాట్లాడాలని కోరుతున్నారు. ఒకవేళ మద్దిలేటి కోరుకున్నట్లు ఈ విషయం మీద బాబు స్పందించి.. అంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే చంద్రుళ్లు ఇద్దరు వియ్యంకులు కావటం ఖాయం. ఇది అసలు కథ.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.