బాబు కాన్వాయ్ లో కొత్త కార్లు
ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఆయన ఏదైనా చేస్తే అందరూ మెచ్చుకునేటట్లుఉండాలి. ఆయన ఏది చెబితే అది శాసనం అయి ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఇతరులకు ఏదేనా చెబితే అది వాళ్లకే కానీ తనకు కాదనేటట్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో విమర్శలపాలవుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఖర్చులు తగ్గించుకోండి అని మంత్రులకు, అధికారులకు జీవోలు పాస్ చేసి చెప్పిన చంద్రబాబు తాను మాత్రం పాటించడం లేదు. ప్రజా ధన్నాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. దుబారా ఖర్చులకు పెట్టింది పేరుగా నిలుస్తున్నారు. బాబుప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుంచి మొదలు పెడితే నేడు ఆయన కొత్తగా కార్లు కొన్న దగ్గరి వరకు వేల కోట్లు ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ప్రత్యేక విమానాల్లో వెళ్లిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూనే ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే వెళ్తున్నారు. అది దేశ రాజధాని ఢిల్లీ కావచ్చు. రాష్ట్ర రాజధాని అమరావతి కావచ్చు. దీనిపై రాష్ట్ర, జాతీయ పత్రికల్లో కథనాలు పుంకాను పుంకాలుగా వచ్చాయి.
తాజాగా ముఖ్యమంత్రి వినియోగిస్తున్న కార్లకు అదనంగా మరో ఆరు వాహనాల్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ లో చంద్రబాబు ప్రయాణించే కారుతో పాటు మరో ఏడు ఉంటాయి. వాటి వెనుక అంబులెన్స్.. ఇతర ఉన్నతాధికారుల వాహనాలు ఉంటాయి. ఇక.. కొత్తగా కొన్న కార్లు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వాడనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం వాడుతున్న కార్లు బ్లాక్ కలర్ లో ఉండగా .. కొత్తగా కొన్న కార్లు మాత్రం తెలుపు రంగులో ఉన్నవి కావటం గమనార్హం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఎవరూ హర్షించడం లేదన్నది వాస్తవం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.