Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandra babu gets the record as Krishna Pushkaralu are happening during his term in office

By   /  August 13, 2016  /  Comments Off on Chandra babu gets the record as Krishna Pushkaralu are happening during his term in office

    Print       Email

chandrababuచంద్ర‌బాబు అరుదైన రికార్డు           

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు ఇప్ప‌టికే ఎక్కువ కాలం ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన రికార్డు ఉండ‌గా తాజాగా ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. మ‌రో ముఖ్య‌మంత్రి రికార్డును స‌మం చేశారు. ఏమిటా రికార్డు అనుకుంటున్నారా.. అయితే వివ‌రాల్లోకి వెళ్దాం. దేశంలోని 12 నదులకు ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. అందులో  రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి – కృష్ణా నదులకు పుష్కరాలు ఏడాది వ్యవధిలో వస్తుంటాయి. ఏ నదికీ లేని విధంగా గోదావరి నదికి పుష్కరాలు పూర్తయిన ఏడాదికి అంత్య పుష్కరాలువస్తాయి. అవి ముగిసిన వెంటనే కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. కాగా ఏడాది వ్యవధిలో రెండు పుష్కరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గోదావరి – కృష్ణా పుష్కరాలు రెండింటినీ ప్రారంభించిన ముఖ్యమంత్రిగా ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డును సమయం చేశారు. 1967 – 68 సంవత్సరాల్లో ఈ అవకాశం అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి దక్కగా మళ్లీ మూడు పుష్కరాల అనంతరం ఈ అవకాశం చంద్రబాబుకు దక్కింది.

1967వ సంవత్సరంలో వచ్చిన గోదావరి పుష్కరాలకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1968లో వచ్చిన కృష్ణా పుష్కరాలకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రెండు పుష్కరాలను ప్రారంభించిన తొలి ముఖ్యమంత్రిగా బ్రహ్మానందరెడ్డి రికార్డు సృష్టించారు. ఇప్పుడు 2015 గోదావరి మహా పుష్కరాలను ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రారంభించారు. శుక్రవారం నుంచి ప్రారంభ‌మైన కృష్ణా పుష్కరాలను కూడా చంద్రబాబు ప్రారంభించారు. అంటే కాసు బ్రహ్మానందరెడ్డి తర్వాత ఇలా రెండు పుష్కరాలను ప్రారంభించే అరుదైన ఘనత చంద్రబాబు సొంతమైంది.  ఇదిలా ఉంటే మరోవైపు దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు కూడా రికార్డులకెక్కారు. రెండు పుష్కరాలను చూసిన తొలి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ప్రస్తుత మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →