బాబుపై బొత్స ఫైర్
అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే బాబు డ్రామాలు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం బాధాకరం
బాబు అభివృద్ధి చేసి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి
చంద్రబాబుకు సవాల్ విసిరిన బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు తన అవినీతి అసమర్థతలను కప్పిపచ్చుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాబు సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనడం అనైతిక చర్య అని తెలిసినా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, ఇది ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నా స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకుండడం బాధాకరమన్నారు.
ఒకపార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలకు మరో పార్టీ కండువా కప్పే సంప్రదాయం ఎప్పుడూ లేదన్నారు. ఒకవేళ పార్టీ మారదలుచుకుంటే ఏ పార్టీ గుర్తుపై గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్లాలే గానీ.. ఇలా డబ్బుల కోసం పార్టీల మారడం లాంటి దుర్మార్గమైన చర్య ఇంకొకటి ఉండదన్నారు. ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడుకు దమ్మూ ధైర్యం ఉంటే పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికి బాబు భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.