Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandra Babu is acting like a Gang Leader!

By   /  June 2, 2016  /  Comments Off on Chandra Babu is acting like a Gang Leader!

    Print       Email

chandrababuబాబూ.. న‌డిరోడ్డుపై దీక్ష‌లా?

 

InCorpTaxAct
Suvidha

 

 

చంద్ర‌బాబు నాయుడు ఏపీకి ముఖ్య‌మంత్రిని అనుకుంటున్నాడో… ఓ గ‌ల్లీ లీడ‌ర్ అనుకుంటున్నారో తెలియ‌దు కానీ ఆయ‌న రూల్స్‌ను పాటించ‌డం లేదు. న‌లుగురికి మార్గ‌ద‌ర్శ‌కంగా నిల‌వాల్సిన వ్య‌క్తి రూల్స్‌ను అతిక్ర‌మిస్తూ న‌వ్వుల పాల‌వుతున్నాడు. గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి జ‌రిగినా మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్నాడు బాబు.. వివ‌రాల్లోకి వెళ్లితే విభజన కారణంగా ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో.. విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వారి మనోభావాల తగ్గట్లుగా చంద్ర‌బాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ దీక్ష‌లు.. ధ‌ర్నాలు ఎక్క‌డైనా జ‌న‌సంచారం త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో చేప‌ట్ట‌డం ఆన‌వాయితీ.  ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉన్నా.. అవేమీ ప‌ట్టించుకోకుండా న‌డిరోడ్డుపై దీక్ష‌లు చేప‌ట్టాల‌ని బాబు పిలుపునివ్వ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.

గ‌తంలోకూడా చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లోని బెంజ్ స‌ర్కిల్ లో ఆందోళ‌న చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.  అయితే నిత్యం బిజీగా ఉండే ఆ ప్రాంతంలో దీక్ష‌లు చేప‌డితే ప్ర‌జ‌లు ఎంత బ్బందులపాల‌వుతారో వేరే చెప్ప‌న‌వస‌రం లేదు. అలాంటి చోట బాబు ఎందుకు దీక్ష‌లు చేప‌డుతున్నారో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అయితే ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎక్క‌డో దూరంగా దీక్ష‌లు చేసుకుంటున్నా.. వాటికి అనుమ‌తులు లేవంటూ బ‌హిరంగ స‌భ‌లు, దీక్ష‌లుజ‌ర‌గ‌కుండా చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు బాబు న‌డిరోడ్డుపై ఎలా చేస్తారంటూ మేధావులు, రాజ‌కీయ విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. బాబుకు ఒక రూల్‌.. ప్ర‌తిప‌క్షాల‌కు ఒక రూలా? అంటూమండిప‌డుతున్నారు. కాగా ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలు కొంత‌మంది మాట్లాడుతూ చంద్ర‌బాబు స‌భ పెడితే జ‌నం రార‌ని తెలుసు కాబ‌ట్టే న‌డిరోడ్డుపై పెడుతున్నార‌ని ఎద్దేవా చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →