Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandra Babu is ex Chief Minister in LinkedIn

By   /  June 27, 2016  /  Comments Off on Chandra Babu is ex Chief Minister in LinkedIn

    Print       Email

Chandrababuబాబు.. మాజీ ఎప్పుడ‌య్యారు?

 

InCorpTaxAct
Suvidha

 

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రోజుకోసారి అయినా ఐటీ గురించి ప్ర‌స్తావిస్తారు. ఐటీలో వ‌చ్చేకొత్త కొత్త టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటుంటామ‌ని చెబుతుంటారు. ప్ర‌పంచానికే పాఠాలు చెప్పాన‌ని చెప్పుకునే ఏపీ సీఎం బాబు ఇప్పుడు ఆ ప్ర‌పంచమే నివ్వెర‌పోయేలా ఓ సంగ‌ట‌న జ‌రిగింది.

ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉండి.. ఎంతో క‌ష్ట‌ప‌డి సాధించుకున్న ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇప్పుడు మాజీ అయింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. ప్రపంచంలోనే ప్రముఖ ప్రొఫెషనల్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీసైన లింక్డిన్ లో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అని వుంది. అది కూడా తెలుగుదేశం పార్టీకి మాజీ ముఖ్యమంత్రి అని కనిపిస్తోంది. లింక్డిన్ లో అప్‌లోడ్‌ చేసిన డేటా ప్రకారం మొత్తానికి బాబు ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ మినిస్టర్ కాదన్న మాట. కేవలం తెలుగుదేశం పార్టీకే ముఖ్యమంత్రి అన్న మాట. అది కూడా మాజీ!! మరి.. ఐటీలో హైదరాబాద్ ను మేటిగా నిలబెట్టింది నేనే. ప్రపంచానికే కంప్యూటర్ పాఠాలు నేర్పింది నేనే అని ఎప్పటికప్పుడు చెప్పుకునే చంద్రబాబు.. తన లింక్డిన్ ను మాత్రం ఎందుకు అప్‌డేట్ చేసుకోలేకపోయాడో ఆశ్చ‌ర‌మేస్తోంది. తెలుగు రాష్ర్టాలకు చంద్రబాబు ఐటీ పితామహుడిగా గుర్తింపు పొందారు. ఇక టీడీపీ నాయకులు – టోటల్ టీడీపీ గురించిన సమాచారం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు జోరుగా అప్ డేట్ అవుతుంటుంది. మరి అలాంటి చంద్రబాబు సీఎంగా ఎన్నికై రెండున్నరేళ్లు అవుతున్నా ఇంకా ఆయన లింక్డిన్ అక్కౌంట్ లో ఆయన తెలుగుదేశం పార్టీకి మాజీ ముఖ్యమంత్రి అని ఉండడం ఆశ్చర్యకరమైన విషయమే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →