Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandra Babu is not criticizing Modi?

By   /  June 3, 2016  /  Comments Off on Chandra Babu is not criticizing Modi?

    Print       Email

chandrababuమోడీని ఒక్క మాట అన‌ని బాబు

 

InCorpTaxAct
Suvidha

 

 

చంద్ర‌బాబు నాయుడు ఎంద‌క‌నో త‌న వాయిస్‌లో ఫోర్స్‌ను త‌గ్గించార‌నిపిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న వాటిని కూడా రాష్ట్రానికి ఇవ్వ‌క‌పోయినా బాబు ఏమీ మాట్లాడ‌డం లేదు. ప్ర‌ధాని మోడీని విమ‌ర్శించ‌డానికి కొంచెం వెనుక‌డుగు వేస్తున్నార‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. అది నిన్న విజ‌య‌వాడ కేంద్రంగా బెంజ్‌స‌ర్కిర్‌లో జ‌రిగిన న‌వ‌నిర్మాణ దీక్ష‌తో తేలిపోయింది. విభజనకు వ్యతిరేకంగా నాటి సీమాంధ్రులు చేసిన ప్రయత్నాల్ని ప్రస్తావించిన చంద్రబాబు.. వారిలో రగులుతున్న మంటను మరింత పెంచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. విభజన చేయాలంటే ఏపీకి న్యాయం చేయాలని తాను కోరిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. రెండు ప్రాంతాలకు న్యాయం చేసిన తర్వాత విభజన ప్రక్రియ పూర్తి చేయాలన్నా వినిపించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత ఆస్తులు రాలేదు.. అప్పులే మిగిలిన విషయాన్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న ఇలా జ‌రుగుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేద‌ని, విభ‌జ‌న‌తో ఏపీకి తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ‌ధాని కూడా లేని రాష్ట్రంలో మ‌నం అభివృద్ధి చేస్తుంటే ప్ర‌తిప‌క్షాలు అడ్డు ప‌డుతున్నాయ‌న్నారు. వాళ్లకు అభివృద్ధి జ‌ర‌గ‌డం ఇష్టం లేద‌ని, అందుకే ఇలాంటి న్యూసెన్స్ చేస్తున్నాయని మండిప‌డ్డారు. కాగా న‌వ నిర్మాణ దీక్ష‌లో ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కానీ, ప్ర‌ధాని మోడీని గానీ ఒక్క మాట‌కూడా అన‌క‌పోవ‌డం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →