తమ్ముళ్లకు బాబు క్లాస్
ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురమ్మంటే అది చేయకపోగా.. చెడ్డపేరు తీసుకువస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై బాబు ఫైర్ అవుతున్నాడట. పుష్కరాల విషయంలోనూ అంతేచేస్తున్నారని, మీరు ఎప్పుటికి మారుతారో చెప్పండని నిలదీశారట. తాజాగా గుళ్ల కూల్చివేత విషయంలో ఎంపీ నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం సీఎంకు మరింత కోపం తెప్పించిందట. అందుకే ఇద్దరికీ బాబు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మీ వ్యక్తిగత విభేదాల వల్లే సమస్యను పెద్దది చేశారని, మిత్రపక్షం నుంచి విమర్శల దాడి పెరగడానికి కారణమయ్యారని, ఎవరిష్టానికి వారు ప్రవర్తిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తుంటే సహించబోనని హెచ్చరించినట్టు తెలిసింది. వెంటనే స్థానికులను శాంతింపజేయాలని, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చంద్రబాబు ఈ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.
కాగా, ఆలయాల తొలగింపు అంశం పెనుదుమారంగా మారగా, పీఠాధిపతులు కూడా బాబు తీరును తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఒకింత సీరియస్‌గానే ఎంపీ, ఎమ్మెల్సీలకు క్లాస్ పీకారట. మరి ఇప్పటికైనా టీడీపీ నేతలు తమ వైఖరులు మార్చుకుంటారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే గుళ్లను కూల్చమని బాబే చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటని క్లాస్ పీకించుకున్న నేతలు బాబుపై గుర్రగా ఉన్నారట.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.