Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandra Babu is unhappy with Modi Government

By   /  August 19, 2016  /  Comments Off on Chandra Babu is unhappy with Modi Government

    Print       Email

chandrababuకేంద్రంపై బాబు అసంతృప్తి

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కేంద్ర స‌ర్కార్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌మ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆర్థిక లోటులు ఏపీని ఆదుకోవాల‌ని ఎన్ని సార్లు అడిగినా కేంద్ర ప్ర‌భుత్వం స‌రిగా స్పందించ‌డం లేద‌న్నారు. ఏపీకి కేంద్రం రూ.1976 కోట్లు సాయం ప్ర‌క‌టించిన దానిపై బాబు స్పందిస్తూ.. కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయంలో స్పష్టత లేద‌న్నారు.  రాష్ట్రానికి సాయం చేసే విసయంలో కేంద్రం మరికొంత ఉదారంగా వ్యవహరించాలన్నారు. ఇపుడు ప్రకటించిన సాయం కేవలం నామమాత్రమేనని సిఎం వ్యాఖ్యానించారు. బుందేల్‌ఖండ్‌కు మంచి ప్యాకేజి ఇచ్చిన కేంద్రం ఏపి విషయంలో అంత ఉదారంగా ఎందుకు ఆలోచించటం లేదో తనకు తెలియటం లేదని పేర్కొన్నారు.  అనంతరం సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా అనంతపురం, చిత్తూరు, కడపజిల్లాలకు నీరందిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇతర రాష్ట్రాల నీటి అవసరాలు కూడా తీర్చే అవకాశం ఉంటుందన్నారు. ఉన్నత విద్యామండలిపై సుప్రింకోర్టు ఇచ్చిన తీర్సు కూడా అమలు కాకపోవటం పట్ల సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు రావాలని సిఎం సూచించారు.

విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఎన్‌డిఏ ప్రభుత్వం మీదుందని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం రూ. 12 వేల కోట్ల ఆర్ధికలోటుతో ఇబ్బందులు పడుతుండగా కేంద్రం ప్రకటించిన రూ. 1176 కోట్లు ఏమూలకు సరిపోదన్నారు. విభజన చట్టంలోని ఐదు ప్రధాన హామీలైన ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజి, ఆర్దికలోటు భర్తీ, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక రైల్వే జోన్ పై వెంటనే కేంద్రం స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా ఆందోళనలు, ఒత్తిళ్ళ నేపధ్యంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి రూ. 1976 కోట్ల ఆర్దికసాయం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను కూడా కేంద్రం విడుదల చేసింది. ఇందులో ఆర్ధికలోటు క్రింద రూ. 1176 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ. 450 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. 350 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేకంగా ఈ స్దాయి నిధులు అందరికీ తెలిసేలా కేంద్రం రాష్ట్రానికి విడుదల చేయటం ఇదే తొలిసారి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →