Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandra Babu is wasting Modi’s time!

By   /  May 18, 2016  /  Comments Off on Chandra Babu is wasting Modi’s time!

    Print       Email

chandrababuఊహించిందే నిజ‌మైంది

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌త్యేక హోదా  ఏపీ హ‌క్కు అని, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపై ఒత్తిడి తెచ్చి అయినా ప్ర‌త్యేక హోదాను సాధించుకుందామ‌ని చెప్పి ఢిల్లీ వెళ్లిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు నిరాశే మిగిలింది. 12 అంశాల‌తో ఢిల్లీ వెళ్లిన బాబుకు ఏ ఒక్క అంశంపై కూడా కేంద్రం నుంచి పూర్తి హామీ దొర‌క‌లేద‌నే తెలుస్తోంది. పైగా బాబుపై మోడీ ఫైర్ అయ్యార‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. కేంద్రం నుంచి రాష్ట్రానికి ల‌క్ష కోట్ల‌కు పైగా నిధులు కేటాయిస్తే ఒక్క దానికి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు లెక్క‌లు చెప్ప‌లేద‌ని, ప్ర‌జా ధ‌నాన్ని నీ సొంత అవ‌స‌రాల‌కు వాడుకుంటావా అంటూ బాబుపై మోడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది. రెండేళ్లు అవుతున్నా రాజ‌ధానిలో ఒక్క అడుగు కూడా ముందుకు పోవ‌డం లేద‌ని, రాజ‌ధాని ప‌రిస‌ర ప్రాంతాల భూ దందాపై కూడా ఆరాతీసిన‌ట్లు తెలుస్తోంది. పైగా ఇటీవ‌ల చంద్ర‌బాబు అవినీతి అక్ర‌మాల‌పై  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `చంద్ర‌బాబు ఎంప‌ర‌ర్ ఆఫ్ క‌రెప్ష‌న్‌` బుక్ గురించి కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో ఏదో అనుకుని ప్ర‌ధాని ద‌గ్గ‌ర‌కి వెళ్లే మ‌రేదో అయింద‌ని బాబు త‌న అనుయాయుల ద‌గ్గ‌ర బాధ‌ప‌డ్డార‌ట‌.

ఏ ఒక్క హామీకి మోడీ హామీ ఇవ్వ‌క‌పోగా మ‌న్నల్నే ఎదురు ప‌న్నిస్తున్నార‌ని బాబు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. అయితే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోయినా కేంద్రంతో విడిపోతే త‌మ‌కే న‌ష్ట‌మ‌ని గ్ర‌హించిన తెలుగు త‌మ్ముళ్లు బీజేపీ సాయం చేయ‌క‌పోయినా మిత్ర ప‌క్షంగానే కొన‌సాగుతామంటున్నారు. తాము బ‌య‌ట‌కు వ‌స్తే ఒక‌ప‌క్క వైసీపీ, టీఆర్ఎస్  ఎప్పుడెప్పుడు బీజేపీలో చేరుదామా అని ఎదురు చూస్తున్నాయ‌ని, అందుకే తాము బీజేపీకి మిత్ర ప‌క్షంగానే కొన‌సాగాత‌మ‌ని కొంత‌మంది టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఏదేమైనా ఎన్నో ఆశ‌ల‌తో వెళ్లిన చంద్ర‌బాబుకు నిరాశే ఎదురైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →