Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandra Babu is worried about cases, Jagan says

By   /  May 19, 2016  /  Comments Off on Chandra Babu is worried about cases, Jagan says

    Print       Email

Jaganబాబుకు కేసుల భ‌యం

 

InCorpTaxAct
Suvidha

 

 

అందుకే మోడీ..కేసీఆర్‌ను అడ‌గ‌లేక పోతున్నాడు

రాష్ట్రాన్ని ఎడారిగా మార్చిన పాపం బాబుదే

జ‌ల‌దీక్ష ముగింపు స‌భ‌లో తెలుగురాష్ట్రాల సీఎంల‌పై జ‌గ‌న్ ఫైర్‌

“తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అక్ర‌మ ప్రాజెక్టులు క‌డుతున్నా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నోటి నుంచి ఎలాంటి మాటా రావడం లేదు.  కొన్నాళ్ల క్రితం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు రూ. 5 నుంచి రూ. 25 కోట్లు లంచం ఇస్తూ చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయాడు.  కేసీఆర్‌ను గట్టిగా నిలదీస్తే ఆయన ఓటుకు కోట్లు కేసు బైటకు తీస్తాడని చంద్రబాబుకు భయం. ఆ టేపులు బైటకు తీసి జైల్లో పెట్టిస్తాడని చంద్రబాబుకు భయం. పోనీ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీనన్నా అడుగుతారా అంటే.. ఈ 24 నెలల్లో  చేసిన అవినీతి మీద సీబీఐతో విచారణ వేయించి జైల్లో పెట్టిస్తారేమోనని చంద్రబాబు భయం“ అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. తెలంగాణ  ప్రాజెక్టులపై ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో వైఎస్ జగన్ చేపట్టిన జల దీక్ష బుధవారం (18వ తేదీ) సాయంత్రం ముగిసింది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడారు.

మొన్నటిదాకా అన్నదమ్ముల్లా కలిసే ఉన్న మ‌నం ఇప్పుడు నీటి కోసం గొడ‌వ‌లు ప‌డాల్సి వ‌స్తోంద‌న్నారు. మహారాష్ర్ట, కర్ణాటక వాళ్లు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే  కలిసికట్టుగా అప్పుడు వ్య‌తికించామ‌ని,  ఇప్పుడు వాళ్లు చేసిన త‌ప్పే కేసీఆర్ కూడా  చేస్తున్నార‌న్నారు.  శ్రీశైలానికి నీరు రాకముందే మహబూబ్‌నగర్ నుంచే 800 అడుగులు లోపే పంపులు పెట్టి నీటిని పైనే తోడేస్తామనడం న్యాయమా? అని కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు. గోదావరి నది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహిస్తుందని చెప్పి.. గోదావరి నీరు ఆంధ్రప్రదేశ్‌లోకి రాకమునుపే ఎడాపెడా ప్రాజెక్టులు కట్టి దాదాపుగా రోజూ 70 వేల క్యూసెక్కుల నీరు తోడేసుకుంటే కింద ఉన్న ఏపీకి నీళ్లు ఎలా వ‌స్తాయ‌ని నిల‌దీశారు. మా రాష్ట్రం పైన  ఉండి మీ రాష్ర్టం కింద ఉండి ఉంటే…మేం కనుక నీళ్లు ఆపి ఉంటే మీకు నచ్చేదా?  అని పేర్కొన్నారు. మా వాట మేం సాధించుకునే వ‌ర‌కు ఈ పోరాటాలు చేస్తూనే ఉంటామ‌ని, ఇది ఆరంభం మాత్ర‌మే అని జ‌గ‌న్ అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →