Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandra Babu making a mistake?

By   /  June 10, 2016  /  Comments Off on Chandra Babu making a mistake?

    Print       Email

chandrababuబాబు త‌ప్పు చేస్తున్నారా?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కాపు నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విష‌యంలో తొంద‌ర‌పాటునిర్ణ‌యాలు తీసుకుంటున్నారా?  ముద్ర‌గ‌డ‌ను అరెస్ట్ చేయ‌డం తొంద‌ర‌పాటు చ‌ర్యేనా? ఇచ్చిన మాట‌ను ప‌క్క‌పెట్టి గ‌త ప్ర‌భుత్వాల‌కంటే కాపుల‌కు ఎక్క‌వ‌గానే చేస్తున్నాన‌ని చెప్పుకుంటూ కాపుల ఆగ్ర‌హానికి బాబు గుర‌వ‌తున్నారా అంటే అవున‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు నాయుడు కాపుల‌ను బీసీ జాబితాలో చేర్చుతామ‌ని, కాపుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వాళ్ల‌ను ఆదుకుంటామ‌ని, కాపుల సంక్షేమం కోసం ఏటా రూ.1000 కోట్లు ఇస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు మాట త‌ప్ప‌డంపై కాపులంతా బాబుపై ఫైర్ అవుతున్నారు. బాబు ఇచ్చిన వాగ్దానాన్ని నెర‌వేర్చ‌క‌పోవ‌డం వ‌ల్లే దీక్ష‌లు, ధ‌ర్నాలు చేయాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు.

ఇదిలా ఉంటే కాపు ఉద్యమంతో తనకు సమస్యలు సృష్టిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలో చంద్రబాబు తొంద‌ర‌ప‌డ్డార‌ని పరిశీలకులు అంటున్నారు.   అనవసరంగా కాపుల పంచాయతీని తెగే దాకా లాగుతూ చంద్రబాబు సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు.  ముద్రగడ గానీ కాపు నేతలను గానీ ఇప్పుడు అరెస్టు చేయాలని అనుకోవడం తొందరపాటు చర్యని… అరెస్టుల విషయంలో ఆయన తొందరపడి ఉండకపోతే ముద్రగడ మళ్లీ హడావుడి చేసేవారు కాదన్న వాదన వినిపిస్తోంది. అదేసమయంలో చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే కాపుల విషయంలో మంచి పనులు చేస్తున్నా ముద్రగడ మొండివాదనలో ముందుకెళ్తున్నారన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా బాబు త‌ప్పు చేస్తున్నార‌న్న వాద‌న కాపుల్లో ప్ర‌స్తుతం బ‌లంగా నాటుక‌పోయింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →