Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandra Babu Naidu is the richest CM in the country

By   /  August 12, 2016  /  Comments Off on Chandra Babu Naidu is the richest CM in the country

    Print       Email

chandrababuదేశంలోనే నం-1 ధ‌న‌వంతుడు బాబేన‌ట‌!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దేశంలోనే నం-1 ధ‌న‌వంతుడ‌ట‌. ఇప్పుడున్న ముఖ్య‌మంత్రుల‌కంటే ఎక్కువ సంపాధిస్తున్న సీఎం చంద్ర‌బాబేన‌ట‌. రాజ‌కీయాల‌తో పాటు వ్యాపారాల్లో కూడా బాబు రాణిస్తున్నంత‌గా మ‌రెవ్వ‌రూ రాణించ‌లేక‌పోతున్నార‌ని అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫామ్స్ (ఏడీఆర్‌) సంస్థ స్ప‌ష్టం చేసింది. ఎన్నికల సంస్కరణలతో పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు గత సాధారణ ఎన్నికలకు ముందు అభ్యర్థులు అందచేసిన అఫిడవిట్‌లను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాయి. ఆ నివేదిక ప్రకారం చంద్రబాబు అత్యధిక ఆస్తులు కలిగిన సీఎంల జాబితాలో తొలి స్థానంలో నిలిచారు.  ఏడీఆర్ సంస్థ నివేదిక ప్రకారం చంద్రబాబుకు 134 కోట్ల 80 లక్షల 11 వేల 728 రూపాయల చరాస్థులు, 42 కోట్ల 68 లక్షల 83 వేల 883 రూపాయల స్థిరాస్తులున్నాయి. 2014లో చంద్రబాబు ఆస్తి రూ. 70.69 లక్షలుగా ప్రకటించారు. భార్య భువనేశ్వరి పేరున రూ. 30 కోట్లు, లోకేష్ ఆస్తి రూ. 3.5 కోట్లు, బ్రహ్మణి ఆస్తి రూ. 90.71 లక్షలుగా పేర్కొన్నారు. ఇవన్నీ నికర ఆస్తులని వెల్లడించారు. 2014లో ప్రకటించిన ఆస్తుల కంటే చంద్రబాబు ఆస్తులు 2015లో 40 శాతం తగ్గాయి.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన తండ్రి ఆస్తులు తగ్గాయని లోకేష్ వెల్లడించారు. చంద్రబాబు ఆస్తి రూ 42.40 లక్షలు, తల్లి భువనేశ్వరి ఆస్తి రూ. 33.07 కోట్లు, తన ఆస్తి రూ. 7.67 కోట్లు, బ్రహ్మణి ఆస్తి రూ. 4.77 కోట్లని లోకేష్ వివరివచారు. 2014లో చంద్రబాబు ఆస్తి రూ. 70.69 లక్షలుగా ఉంది. అయితే చంద్ర‌బాబు బాబు రాజ‌కీయాలు..వ్యాపారాలు రెండింటినీ సమ దృష్టితో చూస్తూ ముందుకెళ్తున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కాబోలు దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో నం-1 ధ‌న‌వంతుడిగా పేరు తెచ్చుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →