బాబు వరాల జల్లు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అరకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనులపై వరాల జల్లు కురిపించారు. వాళ్ల మనసు దోచుకునేలా చాలా హామీలు ఇచ్చారు. బాబు భారీ ఎత్తున వరాలు కురిపించేసరికి గిరిజనులు సంతోషంతో ఉబ్బి తబిబ్బయ్యారు. ఏడాది వ్యవధిలో అరకు రూపురేఖలు మార్చేస్తానని.. అరకును దత్తత తీసుకోనున్నట్లుగా వెల్లడించారు. రూ.68 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన ఆయన.. అరకు కాఫీని అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తానని మాట ఇచ్చారు. లక్ష ఎకరాల్లో కాఫీ సాగు చేయాలన్న ఆయన.. ఏజెన్సీలో పండించే కాఫీ పంటకు విలువ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా బాబు ఇచ్చిన హామీలు ఒకసారి పరిశీలిస్తే…గిరిజనులు చాలా మంది చదువుకు దూరమవుతున్నారని ఆవేదన పడిన చంద్రబాబు వాళ్లను ప్రోత్సహించడంలో భాగంగా బాగా చదువుకున్న గిరిజన విద్యార్థులకు విదేశీ విద్యకు సాయం చేస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు గిరిజన హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లగా మార్పు చేస్తామన్నారు.
అంతేకాకుండా గిరిజన విద్యార్థుల కోసం ఏకలవ్య మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని గిరిజన యువతుల వివాహాలకు గిరిపుత్రిక పథకం కింద రూ.51 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అల్లూరి పేరుతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు, మోదుకొండ జాతరను ప్రభుత్వ పండుగగా గుర్తింపు, నాలుగు నెలల వ్యవధిలో ప్రతి గిరిజన ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే ర్పాట్లు చేస్తామని గిరిజనులకు బాబుహామీ ఇచ్చారు. ఆదివాసులకు గ్యాస్ కనెక్షన్, రూ.2.2 కోట్లతో పద్మాపురం గార్డెన్ అభివృద్ధి, క్రీడల్లో రాణించేందుకు ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్, అరకును ఎడ్యుకేషన్ హబ్‌గా మార్పు , కుండ కుమ్మరులను ఎస్టీలో చేర్చేలా చర్యలు తదితర వాటిని వీలైనంత త్వరగా చేపడతామని చెప్పారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత హామీలు ఇవ్వడం జరిగింది. కాగా హామీలు ఇవ్వడం కాదు.. వాటిని నెరవేర్చలా చర్యలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.