మోడీని బాబు ప్రశ్నించడా?
ఆ రెండు పార్టీలో పైకి మాత్రం మేడిపండు చందంలా వ్యవహరిస్తున్నాయి. మీడియా ముందు స్నేహ హస్తలు ఇచ్చుకుంటూ లోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నాయి. అభివృద్ధి మా బాధ్యత అంటూనే ఆ బాధ్యను నిర్వర్తించడంలో విఫలమవుతూ ప్రజలను మోసం చేస్తున్నాయి. అలా మోసం చేస్తున్న పార్టీలే బీజేపీ, టీడీపీ. భారతీయ జనతా పార్టీకి మిత్రపక్ష మైన తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయం అందడం లేదని అంటుంటే.. బీజేపీ నేతలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు ఇచ్చామని అంటున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ సభ్యులు చెప్పిందే నిజమనుకుంటే ఇప్పుడు టీడీపీ మంచి అవకాశం దొరికినట్లే. ఇప్పుడు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ సమావేశాల్లో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఏమి చేసింది… ఏమి చేయలేదు. ఇంకా ఏమేమి హామీలు నెరవేర్చాలి అనే అంశాలపై భారతీయ జనతా పార్టీని నిలదీయవచ్చు.
పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తని బీజేపీపై టీడీపీ ఫైట్ చేయవచ్చు. ఇచ్చిన హామీలు ఏంటి? చేసే పనులు ఏంటిని అని పార్లమెంట్లో బీజేపీని నిలదీయవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయడానికి ఎందుకో కొంత వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఎంత చేసినా రాజకీయంగా పెద్దగా ఒరిగేదేమీ ఉండదని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సింగపూర్ కంపెనీ లు,జపాన్ కంపెనీ లు ఎన్ని వచ్చినాకేంద్రం సహకరించకుంటే అన్నీవృథానే అయిపోతాయి. ఈ సందర్భంగా ఇక్కడ ఓ విషయం గుర్తు చేసుకోవాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రం పై ఆరోపణలు చేస్తూ మిగతా రాష్ట్రాలకు పెద్ద నీతిని బోధించాడు. పోరాడు లేదా ఎండగట్టు అని హితవు పలికాడు. మరి కేజ్రీవాల్ లా బాబు ఎప్పుడు స్పందిస్తాడో ఏమో.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.