Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandra Babu says, his efforts are not reaching to the people in Vizag

By   /  July 25, 2016  /  Comments Off on Chandra Babu says, his efforts are not reaching to the people in Vizag

    Print       Email

chandrababuబాబు చెప్పిన దెయ్యాలు ఎవ‌రు?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని దెయ్యాలు అడ్డుకుంటున్నాయా? బాబు ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా అవే మింగేస్తున్నాయా? ఏపీ సీఎంకు చెడ్డ‌పేరు తీసుకువ‌స్తున్నాయా? అంటే అవున‌నే అంటున్నారు స్వ‌యాన చంద్ర‌బాబు నాయుడు. తాను ఎంతో కష్టపడి – ఎన్నో రాత్రులు శ్రమించి అమలు చేస్తున్న పథకాల ఫలాలు ప్రజలకు చేరడం లేదని మధ్యలోనే దెయ్యాలు ఆ ఫలాలను మింగేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ పట్నంలో పర్యటించిన చంద్రబాబు.. మీడియాతో కొద్దిసేపు మాట్టాడుతూ.. ఈ విధంగా వ్యాఖ్యానించారు. సంక్షమ పథకాలు ఎన్నో ఉన్నా.. ఏపీ ప్రజలకు అవి చేరువ కావడం లేదనేది వాస్తవం అని బాబు ఒప్పుకున్నారు. పథకాలను ప్రజలకు చేరువ కాకుండా మధ్యలోనే దెయ్యాలు అడ్డుకుని మింగేస్తున్నాయని సాక్షాత్తూ సీఎం అనడమే ఇప్పుడు చర్చకు దారితీసింది. అయితే ప్రజలకు ఆయా సంక్షేమ పథకాలను అందకుండా తినేస్తున్న ‘ఆ దెయ్యాలు’ ఏవో మాత్రం బాబు గారు వెల్లడించలేదు. దీంతో ఆ దెయ్యాలు ఎవరో – ఎక్కడ ఉన్నాయో – ఎలా పుట్టాయో తెలిసి కూడా సీఎం ఎందుకు నోరు విప్పడం లేదన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కొందరు సంక్షేమ పథకాలు ప్రజలకు అందనీయడం లేదని చెప్పిన చంద్రబాబు వారి పేర్లను చెప్పకుండానే పరోక్షంగా వారికి దెయ్యాలు అని పేరు పెట్టి విమర్శించడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అంటే.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతిష్టకు ఎవరు గండికొడుతున్నారో సీఎంకు తెలిసిపోయిందన్నట్టు ఆయన మాటల్లో అర్థం స్పష్టమైంది. కాగా ప్రభుత్వం ఎంత మంచి సంక్షేమ పథకాలు పెట్టామన్నది కాదు అవి పేద ప్రజలకు అందుతున్నాయా లేదా అన్నదే ముఖ్యమని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా బాబు చెప్పిన దెయ్యాలు ఎవ‌రో తెలుసుకోవ‌డానికి మ‌రికొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →