Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandra Babu wants flights from Astana to Vijayawada!

By   /  July 12, 2016  /  Comments Off on Chandra Babu wants flights from Astana to Vijayawada!

    Print       Email

chandrababuఇది విన్నారా…!

 

InCorpTaxAct
Suvidha

 

 

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన ఈ రెండేళ్ల‌లో చేసిన వ్యాఖ్య‌లు కొన్ని పెను దుమారం రేపితే మ‌రికొన్ని హాస్యాస్ప‌దంగా మారాయి. కొన్ని వ్యాఖ్య‌లు అయితే చంద్ర‌బాబును అభాసు పాలు కూడా చేశాయి. అయితే అలాంటి వ్యాఖ్య‌నే బాబును న‌వ్వుల పాలు చేసింది. వివ‌రాల్లోకి వెళ్లితే… కజకిస్థాన్ పర్యటనలో చంద్రబాబు అక్కడి రాజధాని నగరం అస్తానాను పరిశీలించారు. అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. నిర్మాణ సంగతులు తెలుసుకున్నారు. అదంతా బాగానే ఉన్నా.. ఆ తరువాతే అసలు కామెడీ మొదలైంది.  కజకిస్థాన్ రాజధాని నుంచి విజయవాడకు నేరుగా విమానాలు నడపాలని అస్తానా మేయర్ ను కోరారు. దీంతో ఆయన అది తన పరిధిలోని అంశం కాదని.. తమ దేశ రవాణా మంత్రి పరిధిలో ఉంటుందని చెబుతూ.. చంద్రబాబును సేటిస్ఫై చేసేందుకు గాను ఆయనతో తాను మాట్లాడుతానని చెప్పారు. అయితే.. అస్తానా నుంచి అమరావతికి విమానాలు అనగానే సోషల్ మీడియాలో నెటిజన్లు తమ సెటైర్లు మొదలుపెట్టారు.

అసలు కజకిస్థాన్ లోని ఉన్న భారతీయుల సంఖ్యే గట్టిగా 3 వేలు లేదని.. అందులో ఆంధ్ర ప్రజల లెక్క పావు వంతు కూడా ఉండే అవకాశం లేదు. అంటే గట్టిగా 500 మంది ఏపీ వాసులు ఉన్నారో లేదో తెలియని ప్రాంతం నుంచి ఏపీ రాజధానికి విమాన సర్వీసులు నడపాలనడం హాస్యాస్పదంగా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. అస్తానా నుంచి అమరావతికి విమానాలు వేసే బదులు అమరావతి నుంచి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచడంపై దృష్టి పెట్టాలని అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →