బాబుకు పదవీ గండం ఉందా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పదవీ గండం ఉందా? ఆయన మధ్యలోనే సీఎం పదవిని కోల్పోవాల్సి వస్తుందా? అంటే అవుననే అంటున్నారు పలువురు పీఠాధిపతులు. విజయవాడలో విస్తరణ పనుల నేపథ్యంలో పలు ఆలయాలను కూల్చివేయడంపై వాళ్లు స్పందిస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మేలు జరిగే పనులు చేయకుండా కీడు జరిగే పనులే ఎక్కువగా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా చేస్తే రాష్ట్రానికి చెడు జరగడంతో పాటు అతనికి కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి కూడా ఎసరు తెస్తుందంటున్నారు. ఎన్నో పురాతన ఆలయాలను చంద్రబాబు కూల్చివేయించారని.. దేవుళ్ల ఆగ్రహాన్ని ఆయన చవిచూడాల్సివస్తుందని శపిస్తున్నారు. 1903నాటి ఆంజనేయుడి విగ్రహం కూల్చివేయడం ఏమిటని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి మండిపడ్డారు. అర్జునుడి కాలం నాటి వినాయకుడి విగ్రహం కూల్చివేయడం కూడా అపచారమన్నారు.
ఇవన్నీ ఒకెత్తయితే చంద్రబాబు అంతకంటే తీవ్రమైన తప్పిదం చేశారని శివస్వామి అంటున్నారు. రాహు – కేతువుల ఆలయాలను కూడా కూల్చివేశారని ఆవేదన చెందిన ఆయన…. రాహుకేతువులతో పెట్టుకున్నవారెవరూ నష్టపోకుండా ఉండరని.. చంద్రబాబుకు కూడా ఆ ప్రభావం తప్పదని చెబుతున్నారు. రాహుకేతువుల ఆలయాల కూల్చివేత చంద్రబాబు ప్రభుత్వానికే గండమని శివస్వామి అభిప్రాయపడ్డారు. ఆలయాల కూల్చివేతకు నిరసనగా సోమవారం విజయవాడలో చేపట్టిన ర్యాలీ, బహిరంగ సభకు చాలా మంది పీఠాధిపతులు పాల్గొని బాబుతీరును తప్పపట్టడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.