బాబు ఆపరేషన్ ఆకర్షా? వికర్షా?
తనది 40 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందా? ఆ పార్ట నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలు సైతం మళ్లీ వెనక్కు వెళ్లిపోయే పరిస్థితి ఉందా? చంద్రబాబు చేసేది ఆకర్షా? వికర్షా? అంటే మాత్రం ఇటీవల పరిణామాలు చూస్తూ ఉంటే వికర్షే అని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తీసుకుంటే కొన్ని రోజుల క్రితం టీడీపీ, వైసీపీ క్యాడరె(టీడీపీలోకి వచ్చిన వాళ్లు) ఇద్దరూ వెళ్లి మళ్లీ వైసీపీలో చేరారు. తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తరువాత అక్కడి టీడీపీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ముఖ్యంగా పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు ఈ పరిణామంతో హతాశులవుతున్నారు. చంద్రబాబు వల్ల ఏదో సాధ్యమవుతుందని నమ్మి ఇంతకాలం ఆయన వెంట నడిచి ప్రజలకు మేలు చేయాలని భావిస్తే ఉన్నవారికి పొగపెడుతూ ఇతరులను తీసుకురావడంపై మండిపడుతున్నారు. అంతేకాదు… చంద్రబాబువన్నీ మాటలే తప్ప పనులేమీ లేకపోవడం.. ప్రజాసంక్షేమం ఏమాత్రం కనిపించకపోవడంతో టీడీపీని వీడుతున్నారు.
వైసీపీ నుంచి చంద్రబాబు ఒక్కరిని తెచ్చుకుంటే టీడీపీ నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని టీడీపీలో చేర్చుకున్న తరువాత గిద్దలూరు నియోజకవర్గ టీడీపీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఎన్నారై ఐవీ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడంలో ముందుడే ఐవీ రెడ్డి పార్టీని వీడడంతో పార్టీకి నష్టమేని ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. కాగా ఇప్పటికే ఐవీరెడ్డి రాజీనామాతో దెబ్బతిన్న టీడీపీకి గిద్దలూరులో మరో స్ట్రోక్ తగిలింది. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే యాళ్లూరు వెంకటరెడ్డి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో గిద్దలూరులో టీడీపీ తీవ్రంగా నష్టపోయినట్లేనని వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కాస్తా వికర్ష్ గా మారిందని ఆ పార్టీ నేతలు అంటుండడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.