Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandrababu is doing politics with the BJP: KVP Ramachandra Rao

By   /  May 26, 2017  /  Comments Off on Chandrababu is doing politics with the BJP: KVP Ramachandra Rao

    Print       Email

చంద్రబాబు బీజేపీతో విందు రాజకీయాలు చేస్తున్నారు: కేవీపీ రామచంద్రరావు

 

InCorpTaxAct
Suvidha

 

 

 

బీజేపీ దగాకోరు రాజకీయాలు చేస్తోందని రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని మోదీ ఆంధ్రా ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. ఇక చంద్రబాబు.. అమిత్ షా అడుగులకు మడుగులొత్తుతున్నారని అన్నారు. ఆయన ఆంధ్రా ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.

ఏపీ ప్రయోజనాలను గాలికొదిలేసి అమిత్‌షాతో విందు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఏపీ మేలుపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగిపోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు. టీడీపీ-బీజేపీ కూటమిని ప్రజలు తరిమికొట్టే రోజులు త్వరలో రాబోతున్నాయని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →