ఏపీలో నియంతృత్వ పాలన.. చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఆరోపణలు..
ఏపీలో చంద్రబాబు నియంతృత్వ పాలన సాగిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆయన పలమనేరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు త్వరలో చంద్రబాబుకు బుద్ధి చెబుతారని అన్నారు. టీడీపీ నేతలు ఎన్ని నాటకాలు ఆడినా వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అయితే అది తానుంతవరకు జరిగే పని కాదన్నారు. తనకు తప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను జగన్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేవరకు విశ్రమించనని అన్నారు.
వైసీపీ తరపున గెలిచి ప్రలోభాలకు లొంగిపోయి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే అమరనాధరెడ్డిని ఓడించడం ఖాయమని అన్నారు. అమరనాథ్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డితో తనకు రాజకీయ వైరం ఉందన్నారు. అయితే ఆయనకు ఉన్న వ్యక్తిత్వం కుమారుడికి తేలదన్నారు. తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు.వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తాము క్లీన్ స్విప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.