Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

ChandraBabu Naidu begins Bus Tour

By   /  April 6, 2018  /  Comments Off on ChandraBabu Naidu begins Bus Tour

    Print       Email

త్వ‌ర‌లో ఆత్మ‌గౌర‌వ బ‌స్సు యాత్ర‌

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

 

* ఎంపీలు ఏపీకి తిరిగి రాగానే హోదాపోరుపై ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందిస్తాం

* అన్ని జిల్లాల్లో అఖిల ప‌క్షాల‌తో స‌మావేశాలు..బ‌హిరంగ స‌భ‌లు

* హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తాం

డెక్క‌న్ అబ్రాడ్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 10 ఏళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌కుండా మోసం చేసిన ఎన్డీఏ స‌ర్కార్‌పై తెలుగుదేశం పార్టీ పోరుబాట‌కు సిద్ధ‌మైంది. నాడు ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేద‌నే విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్పేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే “ఆత్మ‌గౌర‌వ బ‌స్సు యాత్ర“ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. కాగా పార్ల‌మెంట్ స‌మావేశాలు అయిపోయిన వెంట‌నే ఏపీకి వ‌చ్చిన ఎంపీల‌తో మాట్లాడి త‌ర్వాత ఆత్మ‌గౌర‌వ బ‌స్సు యాత్ర‌కు సంబంధించిన షెడ్యూల్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందిన టీడీపీ  నేత‌లు అంటున్నారు. ఢిల్లీలో జ‌రిగిన ప్ర‌తి విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన బాధ్య‌త ఉంద‌ని, అందుకే బ‌స్సు యాత్ర చేప‌ట్టిన‌ట్లు ఆ పార్టీ ముఖ్య నేత‌లు చెబుతున్నారు.  బస్సు యాత్రలో భాగంగా ప్రతి జిల్లాలోనూ అఖిల పక్షాలతో సమావేశం నిర్వహించి బహిరంగ సభలు నిర్వహించ‌నున్న‌ట్లు ఆ పార్టీ అధికారంగా చెప్పింది.

కాగా, శుక్రవారం ఉదయం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అసెంబ్లీ దాకా సైకిల్ ర్యాలీ తీయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ర్యాలీని ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యేలందరూ సైకిల్ ర్యాలీలో పాల్గొనాలని ప్రభుత్వం కోరింది. ఇక, శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా కోసం చేపట్టాల్సిన కార్యాచరణను చర్చిస్తామని ప్రకటించింది. గురువారం రాష్ట్ర మంత్రులతో సమావేశం ముగిసిన అనంతరం ఈ ప్రకటనను చేశారు. శుక్రవారం లోక్‌సభ వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేయాల్సిందిగా పార్టీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

AP CM Y.S. Jagan’s Dallas meeting is a grand success!

Read More →